Shiva Shani Dev Guru Story: మహాదేవుడు - శని దేవుడికి సంబంధించిన కథ పురాణాల్లో ఉంది. శివుడు స్వయంగా శనికి గురువు. పరమేశ్వరుడిని పూజించేవారిపై శని ప్రభావం ఉండదని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
సనాతన ధర్మంలో, మహాదేవుడు న్యాయానికి కర్మఫలాలకు అధిపతిగా పరిగణిస్తారు. శని దేవుడి పేరు వినగానే అంతా భయపడతారు కానీ విశ్వంలోనే అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించే శని... సాక్షాత్తు మహాదేవునికే గొప్ప భక్తుడు , శిష్యుడు అని మీకు తెలుసా? పురాణాల ప్రకారం, శని దేవుడికి 'న్యాయాధికారి' అనే బిరుదును సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. మహాదేవుడు- శని దేవుని మధ్య ఉన్న ఈ విశిష్టమైన సంబంధం కథను, అలాగే శివుడిని పూజించే వారి పట్ల శని దేవుడు ఎందుకు ఎల్లప్పుడూ దయతో ఉంటాడో తెలుసుకుందాం.
జూలై 14 భౌమవతి అమావాస్య! వివాహం, పిల్లలు, ఉద్యోగ సమస్యలు తగ్గేందుకు రాశి ప్రకారం ఈ దానం చేయండి!
శని దేవుడు మహాదేవునికి ఎలా , ఎందుకు శిష్యుడయ్యాడు?
పురాణాల ప్రకారం, శని దేవుడు సూర్యదేవుడు , ఛాయాదేవిల కుమారుడు. పుట్టినప్పుడు శని అత్యంత నల్లని రంగులో ఉండటంతో, సూర్యదేవుడు తన కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించి, అవమానించాడు. తండ్రి ప్రవర్తనతో మనస్తాపం చెందిన శని దేవుడు శివుని కోసం కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. మండుటెండ, చలి, వానలను సైతం లెక్కచేయకుండా, ఆకలిదప్పికలతో సంవత్సరాల తరబడి శివుడిని పూజించాడు. అతని కఠోర తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై, ఒక వరం కోరుకోమని అతడిని అడిగాడు.
రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం ఎందుకు? అద్భుత ఫలితాలు & రహస్యం!
కర్మఫల దాత స్థానం
శని దేవుడు తన తండ్రి అయిన సూర్య దేవుని కంటే ఎక్కువ శక్తిమంతుడిగా, గౌరవనీయుడిగా నిలిచే ఒక పదవిని, అధికారాన్ని ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. అప్పుడు మహాదేవుడు శని దేవుడిని నవలోకాలలో అత్యున్నత స్థానానికి హెచ్చించి, "కర్మ ప్రదాత" "న్యాయ ప్రదాత "గా నియమించాడు. శని దేవుడు కేవలం మానవులనే కాకుండా, దేవతలను కూడా వారి కర్మల ఆధారంగా శిక్షిస్తాడని లేదా బహుమతి ఇస్తాడని శివుడు ప్రకటించాడు.
సాక్షాత్తు శివుడే శని దేవుని దుష్ట దృష్టి నుంచి తప్పించుకోలేకపోయిన సందర్భం ఇదే మహాదేవుడు - శని దేవుడికి సంబంధించిన ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది, శని దేవుడు తన గురువైన శివుడిని చూడాలని వెళ్లాడు. "ఓ గురుదేవా, రేపు నేను మీ రాశిలోకి ప్రవేశించబోతున్నాను, అందువల్ల నా దృష్టి మీపై కూడా పడుతుంది" అని అన్నాడు. దానికి మహాదేవుడు చిరునవ్వుతో, "ఎంతసేపు నాపై నీ దృష్టిని ఉంచుతావు?" అని అడిగాడు. దానికి శని దేవుడు, "ఒక పావు ప్రహరం (సుమారు మూడున్నర గంటలు)" అని బదులిచ్చాడు. శని దేవుని ఆగ్రహం నుంటి తప్పించుకోవడానికి, మహాదేవుడు ... ఏనుగు వేషంలో భూలోకానికి వచ్చి అడవిలో దాక్కున్నాడు. కాసేపటి తర్వాత మహాదేవుడు తన దైవ స్వరూపానికి తిరిగి వచ్చి.. "చూడు శనీ, నీ దుష్ట దృష్టి నాకు హాని చేయలేకపోయింది." అందుకు బదులుగా శనిదేవుడు చేతులు జోడించి.. "ఓ ప్రభూ! నా చూపు ప్రభావం కారణంగా.. విశ్వనాథుడు తన దైవ రూపాన్ని విడిచిపెట్టి, పావుగంట సేపు జంతు రూపంలో (ఏనుగు) మారి అజ్ఞాతంలో జీవించవలసి వచ్చింది." అని వియనంగా చెప్పాడు. శని... ఈ నిష్పాక్షిక న్యాయానికి మహాదేవుడు అత్యంత సంతోషించి, శనిదేవుడిని ఆలింగనం చేసుకున్నాడు.
వంట నుంచి సైన్స్ కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
శివ భక్తులపై శని ప్రభావం తక్కువ జ్యోతిష్యం , పురాణాలు స్పష్టంగా చెబుతున్నదేమిటంటే, శివుని నిజమైన భక్తునికి శని దేవుని వలన ఎన్నడూ ఇబ్బంది కలగదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి
గురు-శిష్య సంబంధం: శని దేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు. సనాతన సంప్రదాయంలో, శిష్యుడు తన గురువుకు గానీ, ఆయన ప్రియ భక్తులకు గానీ ఎన్నడూ హాని చేయడు. ఎవరైనా శివుడిని పూజిస్తే, శని దేవుడు వారిపై తన దుష్ట దృష్టిని ప్రసరింపజేయడు.
కర్మ ప్రక్షాళన: శివభక్తి ఒక వ్యక్తిలో సానుకూల శక్తిని నింపుతుంది వారిని చెడు పనులకు దూరంగా ఉంచుతుంది. శని దేవుడు చెడు పనులను మాత్రమే శిక్షిస్తాడు కాబట్టి, ఆయన శివ భక్తుల పుణ్యకార్యాలకు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు.
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
శని దోషాన్ని వదిలించుకోవడానికి సులభమైన నివారణలు
మీరు శని ప్రభావంతో బాధపడుతుంటే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివారాధన చేయడం ఉత్తమ మార్గం శివలింగానికి అభిషేకం చేయండి.. నల్లటి నువ్వులు కలిపిన నీటిని ప్రతి శనివారం సమర్పించి 'ఓం నమః శివాయ' అని జపించండి.
మహా మృత్యుంజయ మంత్రం: ప్రతిరోజూ లేదా ముఖ్యంగా శనివారాల్లో మహా మృత్యుంజయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల అన్ని రకాల శని దోషాలు శాంతిస్తాయి.
శని చాలీసా శివ చాలీసా: శనివారం నాడు శివ , శని ఇద్దరి చాలీసాలను పఠించడం చాలా ఫలప్రదం
పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
