Shanichari Amavasya 2022: భాద్రపద మాసంలో శనిశ్చరి అమావాస్య 14 ఏళ్ల తర్వాత వచ్చింది. ఈ పర్వదినాన శని దేవుని అనుగ్రహం పొందేందుకు చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ సమయంలో జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే శని దేవుని ప్రభావం నుండి విముక్తి పొందొచ్చు. ఈ సందర్భంగా శని అమావాస్య రోజున పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Also Read: శక్తి గణపతి - ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే వెళ్లలేరు స్వామి పిలిస్తేనే వెళ్లగలరు
 
తెలుగునెలల్లో...కృష్ణపక్షం చవిరి రోజు వచ్చే తిథి అమావాస్య. ఆరోజుతో ఆ తెలుగు నెల పూర్తై..పాడ్యమి నుంచి మరో తెలుగు నెల ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది. ఆగస్టు 27న అమావాస్యతో శ్రావణమాసం పూర్తై భాద్రపదమాసం ప్రారంభమవుతుంది. ఆ శనివారాన్ని శ్రావణ అమావాస్య లేదా పోలాల అమావాస్య అంటారు. ఉత్తరభారత దేశంలో మాత్రం భాద్రపద అమావాస్యగానే పరిగణిస్తారు. ఇలా శ్రావణమాసంలో అమావాస్య-శనివారం కలసిరావడం 14 ఏళ్ల తర్వాత జరిగింది. అందుకే అత్యంత పవర్ ఫుల్ అని చెబుతున్నారు పండితులు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేవారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనితో బాధలుపడుతున్నవారు....



  • శని అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించడం మంచి ఫలితాన్నిస్తుంది

  • శనిదేవునికి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి

  • నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలను దానం చేయాలి

  • శని అమావాస్య రోజున శని దేవుని మంత్రాలను జపించాలి

  • వీలైనంత మేర దాన, ధర్మాలు చేయాలి

  • హనుమాన్ చాలీశా చదవడం అత్యుత్తమం


ఈ శని అమావాస్యకి మరో ప్రత్యేకత ఏంటంటే..ప్రస్తుతం శని తన సొంతరాశి అయిన మకరంలో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా శనిని పూజిస్తే తక్షణమే బాధల నుంచి ఉపశమనం లభిస్తుందంటారు పండితులు.


Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!


శని శ్లోకాలు
ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః 


కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ: 
సౌరి శనైశ్చరో మంద: 
పిప్పలాదేవ సంస్తుత: 


శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే


ఈ శ్లోకాలను కుదిరితే నిత్యం లేదంటే ప్రతి శనివారం జపించడం వల్ల శనిదోషం తగ్గుతుందని చెబుతారు. ముఖ్యంగా ఆంజనేయుడిని, శివుడిని పూజించినా శని ప్రభావం తక్కువ ఉంటుందంటారు. 


నోట్: వీటిని ఎంతవరకూ అనుసరించవచ్చు అనేది మీ భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది