Maha Kumbh Mela 2025 : జనవరి 29న మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా (Maha Kumbh Mela) లో రెండో అమృత స్నానం జరగనుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఈ పవిత్ర స్నానం సందర్భంగా మరో వెయ్యి బస్సులను నడపాలని ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ (Uttar Pradesh Transport Department) నిర్ణయించింది. మౌని అవావాస్య రోజు 7వేల బస్సులు నడపాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ.. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఈ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanadh) తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

భక్తుల కోసం బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

మహా కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్ లో 9 తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ (Dayashankar Singh) ఆదేశించారు. ఈ స్టేషన్లలో బస, దుప్పట్లు, టీ వంటి తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ (First Aid Box)లు, అగ్ని మాపక భద్రతా పరికరాల ఏర్పాట్లను పటిష్టం చేయాలని, అంబులెన్స్ లు, క్రేన్ లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. మరో పక్క భక్తుల సౌకర్యాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railway) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తేవడంతో పాటు నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.

Also Read: మన పెద్దవాళ్లు ఎక్కడికీ ముగ్గురిని వెళ్లనివ్వరు, ఎందుకు - అసలు 3 అనే సంఖ్య శుభమా, అశుభమా - ఇందులో ఉన్న నిజమెంత ?

ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాగ్ రాజ్ (Prayag Raj) తో పాటు చుట్టుపక్కల స్టేషన్లలోనూ సౌకర్యాలను పెంచింది. ఈ క్రమంలో ఢిల్లీలోని హౌరా రైలు మార్గంలో అత్యంత రద్దీగా ఉండే పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ నుంచి కుంభమేళాకు గంట గంటకూ ఓ ప్రత్యేక రైలు నడిచేలా ఏర్పాట్లు చేసింది.

కుంభమేళాలో స్నానమాచరించిన అమిత్ షా (Amit Shah)

ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లారు. పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన పుణ్య స్నానమాచరించారు. అనంతరం అమిత్‌ షాతో పాటు ఆయన మనుమడికి కూడా సాధు ప్రముఖలు తిలకం దిద్దారు. ఇకపోతే ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోదీ (PM Modi) రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అందుకు కావల్సిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read : SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం