Saraswati Pushkaralu Starting and Ending Dates: ఏడాదికో నదికి పుష్కారాలొస్తాయి. ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. గురువారం తెల్లవారుజామున 5 గంటల 44 నిముషాలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. బుధవారం రాత్రి సమయానికే బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటికీ..సూర్యోదయానికి చేసే స్నానమే ప్రధానం. అందుకే గురువారం ఉదయం పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. పుష్కరాలు ఈ నెల 26వరకూ జరగనున్నాయి. ఈ మేరకు భారీగా తరలివస్తున్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రాణహిత నదికి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరిగాయి..ఈ ఏడాది సరస్వతి నదికి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 15 సాయంత్రం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతి ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు.
భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఘాట్లని సుందరంగా తీర్చిదిద్దారు. 86 మీటర్ల పొడవుతో జ్ఞాన సరస్వతిఘాట్‌ను కొత్తగా నిర్మించారు. కోటి రూపాయల వ్యయంతో తమిళనాడులోని మహబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. సాధారణ భక్తుల వసతి కోసం టెంట్ సిటీ సిద్ధం చేశారు. రోజుకి లక్ష మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పుష్కరాలు ప్రారంభం కావడంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పుష్కరాల సందర్భంగా నదీ జలాలు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
నిత్యం ఉదయం ఎనిమిదిన్నర నుంచి 11 వరకు తీరం వెంట యాగాలు నిర్వహిస్తారురోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 గంటల సరస్వతి ఘాట్ లో నవరత్న మాల హారతి నిర్వహిస్తారుపుష్కరాలు జరిగే అన్ని రోజులు రాత్రివేళ ప్రవచన కర్తల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయిపుష్కరాలకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
భారతదేశం చివరి గ్రామం అయిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా మానాలో సరస్వతి నది ఉద్భవించింది. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉండడంతో భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి