జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైనా.. సిరి సంపదలు.. కీర్తి ప్రతిష్టలు కావాలన్నా.. మంగళ వారం కొన్ని పరిహారాలు చేసుకుంటే అమంగళకర విషయాలన్నీ తొలగిపోయి మంగళకరంగా మారుతుంది.


కొన్ని సార్లు ఏపని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏపని చేసినా పూర్తి చెయ్యడం కష్టమవుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సతమవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో దారీతెన్నూ కనిపించదు. అన్నింటికీ దేవుడే ఉన్నాడనే భావన కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో దైవారాధన చేసుకోవడం ద్వారా మానసిక బలం పెరిగి సమస్యల పరిష్కారం సులభతరమవుతుంది. అలాంటి కొన్ని పరిహారాలను శాస్త్రాలు సూచిస్తున్నాయి.


మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియమైన రోజు. మంగళవారం హనుమంతుడి ఆరాధన చేస్తే ఆయన కరుణకు పాత్రులు కాగలరు. ఆంజనేయ స్వామి ఆరాధనతోపాటు కష్ట నివారణ కోసం కొన్ని పరిహారాలను కూడా శాస్త్రం సూచిస్తోంది. అవేమిటో తెలుసుకుందాం.


మంగళ వారం తెల్లవారు జామున నిద్ర లేచి స్నానం చేసి..


‘‘ఓం నమో హనుమతు రుద్రావతారాయ


సర్వ శత్రు సంహారణాయ:


స్వర్వ రోగ హరాయ


సర్వ వశీకరణ రామదూతాయ స్వాహా’’


అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు భక్తితో జపించాలి. ఈ మంత్ర పఠనంతో సకల అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం సిధ్దిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు. విజయం సాధిస్తారు.


మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తే రుణవిమోచన సులభమవుతుంది. ఈ పరిహారంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆటంకాలు తొలగి పనులు సులభంగా పూర్తవుతాయి.


మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించడం వల్ల శక్తిమంతులుగా మారుతారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. భయాలు తొలగి ధైర్యం చేకూరుతుంది. ఆర్థిక వృద్ధి కూడా జరుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.


ఆఫీస్ లో సమస్యలు, ఆర్థిక పరిస్థితులు సరిలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోంటున్న వారు మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకుల పూజ చేయించుకుంటే ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది.


తీరని కోరికలు ఉన్న వారు మంగళవారం రోజున హనుమంతుడి పూజించుకుని ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర్’’ అనే మంత్రం జపించాలి. యత్ పూజితం మయా దేవ్ పరిపూర్ణ సామరస్యంతో అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఈ పరిహారాలు చేసుకోవడం వీలుకాదని భావిస్తే మరింత సులభమైన మరో పరిహారం కూడా చేసుకోవచ్చు. మంగళవారం రోజున ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని వీలైనంత ఎక్కువ సార్లు భక్తిగా, నమ్మకంతో రామనామాన్ని జపించుకుంటే తప్పకుండా హానుమంతుడి దయతో కష్టాలన్నీ తొలగిపోతాయి. రామనామ జపంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా. కాబట్టి ఈ మంగళవారం నుంచి ఇవన్నీ ప్రయత్నించండి.


Also Read : చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?






Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.