Sabarimala Temple 18 Steps Significance:  అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లను  ‘పదునెట్టాంబడి’ అని పిలుస్తారు. ఈ మెట్లను అధిరోహించేందుకు స్వాములంతా పోటీపడతారు. 41 రోజులు కఠిన నిమయాలతో మండల దీక్ష చేపట్టి ఇరుముడి తలపై పెట్టుకుని అయ్యప్పను దర్శించుకునేందుకు ఈ సోపానాలు దాటుతారు.  


18 అనే నంబర్ ఎందుకు? ఈ నంబర్ కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ 18 మెట్లు దేనికి సంకేతం? అంటే...
మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువయ్యే ముందు 4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలన్నీ ఒక్కో మెట్టుగా మారాయని... ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్టించాడని చెబుతారు. 


పట్టబంధాసనంలో  కూర్చుని చిన్ముద్ర, అభయహస్తంతో  భక్తులకు దర్శనమిచ్చి యోగసమాదిలోకి స్వామివారు వెళ్లిపోయి..జ్యోతిరూపంలో అంతర్థానమయ్యాడని చెబుతారు. అందుకే మకర జ్యోతికి అంత ప్రాధాన్యత.. మకర జ్యోతి దర్శనం అంటే సాక్షాత్తూ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టే అని భావిస్తారు భక్తులు.


అయ్యప్ప ఒక్కో మెట్టు ఎక్కుతూ..తన వద్ద ఉన్న ఒక్కో అస్త్రాన్ని జారవిడిచాడని చెబుతారు..ఆ అస్త్రాల పేర్లు ఇవే


1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 
11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం


ప్రతి మెట్టుకి ఓ పేరుంది


1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక


అష్టాదశ దేవతలకు సూచన 


1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి


18 మెట్లలో ఏ మెట్టుపై ఏం వదిలేయాలి?


ఒక్కో ఏడాది ఒక్కో మెట్టుపై ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలంటారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. అంటే ప్రతి వ్యక్తి మంచి విషయాలనే చూడాలి, మంచి వినాలి, మంచి మాట్లాడాలని అర్థం.


6 నుంచి 13 మెట్లు  అష్టరాగాలకు సంకేతం. కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పం.. వీటిని విడిచిపెట్టాలని సంకేతం


14,15,16 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచనగా చెబుతార


17,18 మెట్లు... విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం...ఆ జ్ఞానాన్ని పొందేందుకు అజ్ఞానాన్ని విడిచిపెట్టాలని సంకేతం. 


18 కొండలకు సంకేతం


1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల


ప్రతి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గుణాలు అన్నింటికీ ఈ 18 మెట్లు సంకేతం. అందుకే  18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాతే స్వామివారి దర్శనం లభిస్తుంది... 


నియమాల మాలతో సుగుణాల మట్లపై నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర.. కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః