వెలుగుల రేడు సూర్యుడి వేడుకకు అరసవల్లి సిద్ధమైంది. ఆ భాస్కరుడి సన్నిధి ముస్తాబైంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నారు. ఒడిశాలో కొణార్క్ దేవాలయం ఉండగా ఆ దేవాలయం శిధిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రవేశాన్ని మూసివేశారు. ఇక అక్కడి ఆలయం పర్యాటకులను కనువిందుచేయడానికి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దేవాలయంలో మాత్రం నిరంతరం స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఉంది. 


నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు


దేవేంద్రుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమై సమస్త జనాలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడి జయంతి రోజున స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు క్యూ కట్టడం అన్వాయితీ. నిత్య పూజలందుకుంటున్నా ది కేవలం అరసవల్లిలో కొలువైన ఆదిత్యుడు కావడంతోనే లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రత్యక్ష దైవంగా భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆలయం అభివృద్ధికి క్రీ.శ.682లో దేవేంద్రవర్మ అనే రాజు భూములిచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. 

Arasavalli Temple: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు


అరసవల్లి సూర్యదేవాలయం విశిష్టతపై పరిశీలిస్తే ఏడు అశ్వాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా మూలవిరాట్‌ భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణశిలతో చేసిన ఉత్సవ విగ్రహం భక్తలకు కనువిందు చేస్తుంది. స్వామివారి రెండు హస్తాల్లోని తామర పద్మాలు అబ్బురపరుస్తాయి. కఠారి అనే చురిక (కత్తి) నడుము వద్ద ఆయుధంగా ధరిస్తారు. ఆలయానికి భువనేశ్వరిదేవి సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.


నిజరూప దర్శనం 


అటువంటి ప్రసిద్ది చెందిన దేవాలయంలో కలియుగభగవానుడి జయంతిని పురస్కరించుకుని అరసవల్లి ముస్తాబైంది. సూర్య జయంతి సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని కనులారా తిలకించేందుకు భక్తజనం తరలివచ్చారు . ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలిశంకరశర్మ  ప్రత్యేక పూజలు చేసి  స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించడం సంప్రాదాయం . వెలుగుల రేడు సూర్యజయంతి కావడంతో ఆలయంలో ఆదిత్యుని  ఏకశిల పై నిజరూపంలో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని  భక్తులు నమ్మకం.



ఆరోగ్యానికి సూర్య దర్శనం..


పుట్టిన పసిబిడ్డకు పచ్చకామెర్లు వస్తుంటాయి. ఆ సమయంలో ఉదయాన్నే సూర్య ఉదయం సమయంలో ఆ పిల్ల వారిని చూపిస్తే సూర్యరశ్మి శరీరం మీద పడి వారికి పచ్చకామెర్లు అనేవి పోతాయి. ఇక ఒంటి మీద మచ్చలు. ఒంటికి సంబంధించిన కొన్ని రోగ నిర్మూలతలను కూడా సూర్యరశ్మి వల్ల పోతాయని ప్రగాఢ విశ్వాసం. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు.. సూర్య జయంతి రోజు నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయని అన్నదిగా వస్తున్న ఆచారం.




సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకత ఏంటి..


అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిత్యం పూజలందుకునే దేవాలయం. రథసప్తమి జయంతి రోజు ఇంద్ర పుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి పెడితే ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్మకంతో అక్కడే నైవేద్యం తయారుచేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు. 




ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు వేసి పాలు బాగా మరిగిన తర్వాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత చిన్న బెల్లం రేగు కాయలు వేసి చెరుకు గెడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం దానికి పాలకు వచ్చి ఎంతో రుచిగా మారుతుందని చెబుతారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి కూడా ఇంద్ర పుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయం అయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు.