Ramayana And Mahabharat: రామాయణం -మహాభారతం రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు వ్యక్తులు వీరే...


పరశురాముడు
రామాయణంలో సీతా స్వయంవరంలో విల్లు పగలగొట్టిన తరువాత పరశురాముడు శ్రీరామచంద్రుడికి సవాల్ విసిరాడు. ‘ రామా !నీ పరాక్రమము అద్భుతం! శివధనుస్సు ఎక్కుపెట్టావని తెలియగానే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరొక ధనస్సు తీసుకొచ్చానంటాడు. ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు అని చేతికందించాడు. దాన్ని కూడా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. ఆసమయంలో రాముడు తన సుదర్శన చక్రాన్ని పరశురాముడికి అప్పగించాడు. ద్వాపర యుగంలో పరశురాముడు అదే చక్రాన్ని  శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చాడు.


హనుమంతుడు
హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికీ బతికే ఉన్నాడని భక్తుల విశ్వాసం. సీతమ్మ జాడ తెలియజేయడంతో పాటూ రావణుడి లంకపై దండెత్తి వెళ్లేందుకు శ్రీరాముడి సైన్యాన్ని ముందుండి నడిపించాడు ఆంజనేయుడు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో..అర్జునుడి రథంపై కూర్చుని తనకి విజయం దక్కేలా సహాయం చేశాడు.


Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!


జాంబవంతుడు
నీ కోరిన ఏంటో చెప్పు తీరుస్తానని ఓసారి శ్రీరాముడు..జాంబవంతుడిని అడిగితే.. స్వామీ మీతో ద్వంద యుద్ధం చేయాలని ఉందని చెప్పాడు. ఈ కోరిక ఈ జన్మలో కాదు..వచ్చే జన్మలో తీరుతుందని చెప్పాడు. ద్వాపరయుగంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శ్యమంతకమణిని వేసుకుని వేటకు వెళ్లి చనిపోతాడు. ఆ నింద శ్రీ కృష్ణుడిపై పడుతుంది. అప్పుడు శ్రీ కృష్ణుడు శ్యమంతకమణిని వెతుక్కుంటూ వెళ్లగా జాంబవంతుడి గుహలో కనిపిస్తుంది. జాంబవంతుడితో ద్వంద యుద్ధం చేసి గత జన్మలో కోరిక కోర్కె తీరుస్తాడు.


మయాసురుడు
మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు.  మయాసురుడు అని కూడా పిలుస్తారు. మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణాలు నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు గొప్ప ఐశ్వర్యం, బలంతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడంతో శివుడు వాటిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత మయ రాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నాడు.అదే ఇప్పటి మీరట్.  రామాయణంలో మయుడి ప్రస్తావన విషయానికొస్తే.. రావణుడు పెళ్లిచేసుకున్న మండోదరి తండ్రి మయుడు. మహాభారతంలో..ఇంద్రప్రస్థంలో పాండవులకు అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చింది మయుడే. ఆ భవనమే మయసభగా పేరొందింది..


Also Read: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!


దుర్వాస మహర్షి
రామాయణం, మహాభారతాలను కూడా చూసిన గొప్ప వ్యక్తి దూర్వాసుడు. ఓ పురాణం ప్రకారం  దుర్వాసుడి శాపం కారణంగానే లక్ష్మణుడు రాముడికి ఇచ్చిన వాగ్ధానం ఉల్లంఘించాల్సి వచ్చిందని చెబుతారు. మహాభారంతో కుంతీదేవికి.. దేవతా ఉపాసనా మంత్రాలను ఉపదేశించింది దూర్వాసుడే. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించి పిల్లల్ని పొందింది. పెళ్ళి కాక  ముందు సూర్యుడిని ప్రార్థించి కర్ణుడిని కని నీటిలో వదిలేస్తుంది. పాండురాజుతో వివాహం తర్వాత సంతానం కూడా ఇంద్రుడు, యముడు, అశ్వినీదేవతలను ప్రార్థించి సంతానాన్ని పొందింది. 


అగస్త్యుడు, శక్తి మహర్షి, భారద్వాజ మహర్షి, కుబేరుడు ఇంకా చాలామంది రామాయణం మహాభారతంలో రెండింటిలోనూ ఉన్నారు. 


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి