Happy Ramadan Wishes 2024:  ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' ఆవిర్భవించిన నెల రంజాన్. అందుకే ఈ మాసంలో ఉపవాసాలకు చాలా ప్రాధాన్యత ఉంది. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభమైన ఉపవాస దీక్ష సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందుతో విరమిస్తారు. నెల రోజుల పాటూ ఇలా ఉపవాస దీక్షలు చేపట్టాక...మళ్లీ నెలవంక దర్శనమివ్వడంతో దీక్షలు ముగిస్తారు. దీక్షలు ముగించేరోజు ఈద్ ఉల్ ఫీతర్ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని, రంజాన్ శుభాకంక్షలు అని చెప్పుకుంటారు. మీ స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..


Also Read: ఈ నెలలోనే ఎందుకు రంజాన్ - ఉపవాస దీక్షల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా!


ముస్లిం సోదరులందరకీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు


రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని 
ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా
రంజాన్ శుభాకాంక్షలు


అల్లా మీ జీవితంలో ఆనందాలు నింపాలి 
ఐశ్వర్యాలు ప్రసాదించాలి మంచి జ్ఞాపకాల్ని మిగల్చాలి
ఈద్ ముబారక్


ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణం
అందులో ఈద్-ఉల్-ఫితర్ ఓ అద్భుత ఘట్టం
 ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు


రంజాన్ అంటే క్షమాపణ కోరడానికి మరో అవకాశం
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
రంజాన్ శుభాకాంక్షలు 2024


విధేయతతో కూడిన పనులు మీకు మంచి ప్రతిఫలాన్నిస్తాయి
అల్లా ఆశీస్సులు సదా మీపై ఉండాలని కోరుకుంటూ 
రంజాన్ శుభాకాంక్షలు


Alos Read: మీరు గమనించారా! కార్తీకమాసం - రంజాన్ సేమ్ టు సేమ్!


అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు


జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అధిగమించే శక్తి అల్లా మీకు ప్రసాదించాలి
ఈద్ ముబారక్


ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం
మీ అందరకీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు


దేవునిపై భక్తి విశ్వాసాలు కలవారి కర్మానుసారం
పవిత్రమైన జీవితం అందుతుందంటోంది ఖురాన్
రంజాన్ శుభాకాంక్షలు


ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని
అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు


ఆ చంద్రుడి కాంతి మీపై ప్రసరించాలి
అల్లా దీవెనలతో మీరు కోరుకునే ప్రతీదీ జరగాలి
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు


ఈ మహత్తరమైన రోజున మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి
మీ అందరకీ రంజాన్ శుభాకాంక్షలు


ఈ పవిత్ర మాసం మీ ఆశలు నెరవేర్చాలని కోరుకుంటూ
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్


మీ జీవితం ఎంత కష్టతరమైనప్పటికీ రంజాన్ దానిని మార్చగలదని విశ్వశించండి
మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలి
రంజాన్ శుభాకాంక్షలు


క్రమ శిక్షణ, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు


ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు
పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం 
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు


అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు


ఈ పవిత్ర మాసంలో అల్లా మీకు విజయాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాడు
రంజాన్ శుభాకాంక్షలు