Significance of the Tamil New Year: తెలుగువారి పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. మానం అంటే కొలిచేదని అర్థం. చాంద్రమానం అంటే భూమికి అనుగుణంగా చంద్రుడి గమనం ఆధారంగా తిధులు, వారాలు, నెలలు , మాసాలు, సంవత్సరాలు నిర్ణయిస్తారు. అయితే చాలామంది పాటిస్తున్న గ్రిగెరియన్ క్యాలెండర్ సౌరమానం ప్రకారం ఉంటుంది. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఆధారం చేసుకుని పండుగలు నిర్ణయిస్తారు. భూమి తన చుట్టూ తాను తిరిగే సమయం ఒక రోజు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కాలాన్ని ఏడాదిగా పరిగణించి, దాన్ని 12 నెలలుగా విభజిస్తారు.ఏటా మిగిలిన పావు రోజును నాలుగో ఏడాదిలో కలిపి 366 రోజులుగా గణిస్తారు.
తెలుగు, కన్నడ వారి క్యాలెండర్లు, పంచాంగాలు చాంద్రమానం ప్రకారం ఉంటాయి. తెలుగు నెలలు, తిథుల్లో మార్పులుంటాయి., హెచ్చుతగ్గులుంటాయి. అందుకే పండుగలు వచ్చే తేదీలు మారుతాయి. కేవలం మకర సంక్రాంతి మాత్రమే డేట్ మారదు. ఎందుకంటే సూర్యగమనం ఆధారంగా జరుపుకునే పండుగ కాబట్టి మకర సంక్రాంతి తేదీలో మార్పులుండవు. మిగిలిన పండుగలన్నీ చంద్రగమనం ఆధారంగా జరుపుకుంటాం కాబట్టి మార్పులుంటాయి. ఇక తమిళులు సౌరమానం ప్రకారం పండుగలు జరుపుకుంటారు. అందుకే వారి నూతన సంవత్సరాది ఉగాది తేదీలో మార్పులుండవు. ఏటా ఏప్రిల్ 14నే వస్తుంది.
తెలుగు సంవత్సరాదిని ఉగాది అని పిలిచినట్టే తమిళ సంవత్సరాదిని పుతండు అని అంటారు. అంటే తమిళ క్యాలెండర్లో ఇది మొదటిరోజు. భారతదేశంలోని తమిళులే కాదు ఇతర దేశాల్లో ఉండే హిందు తమిళులు నివసించే దేశాలు శ్రీలంక , మారిషస్ , మలేషియా , రీయూనియన్, సింగపూర్ తమిళ హిందువులు ఈ పండగను సాంస్కృతిక, సామాజిక, మతపరమైన వేడుకగా జరుపుకుంటారు. విందులు, బహుమతి ఇవ్వడం, దేవాలయాలను సందర్శించడం చేస్తారు
ఈ రోజున తమిళులంతా "పుతౌడు వాజ్తుగల్" , "ఇసియా పుతండు నల్వాజ్తుగల్!" అని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ రోజును కుటుంబం మొత్తం సంతోష సమయం గడుపుతారు. ఇంటికి శుభ్రపరుచుకుని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిండివంటలు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరు రుచులతో తెలుగువారు ఉగాది పచ్చడి చేసినట్టే తమిళులు కూడా పచ్చడి చేసి నివేదిస్తారు. ఈ రోజు ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల వద్ద ఆశీస్సులు తీసుకుంటారు. తమిళ సంవత్సరాది రోజు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో చిట్టెరై తిరువిజా ఘనంగా నిర్వహిస్తారు. కుంభకోణం సమీపంలో తిరువిడైమరుదూర్ వద్ద పెద్ద కార్ ఫెస్టివల్ జరుగుతుంది. తిరుచిరాపల్లి, కాంచీపురం మరియు ఇతర ప్రదేశాల్లోనూ ఎక్కడ చూసినా పండుగవాతావరణమే. శ్రీ లంకలో తమిళులు కై-విశేషం అని పిలుస్తారు. ఈ రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్తగా వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు శుభదినంగా భావిస్తారు.
ఇనియా పుతండు నల్ వజ్తుక్కల్ అని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి