Rath Yatra Thursday 16 July 2026: పూరి రథయాత్రలో మూడు రథాలుంటాయి.. జగన్నాథుడు-బలభద్రుడు-సుభద్ర రథాలు. ఈ రథాల తయారీకి సంబంధించి చెక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారు..తయారీ ఎలా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రథాల తయారీకి చెక్క ఎంపిక ఎలా? బనజాగ యాత్ర అనే ప్రత్యేక ఆచారం ద్వారా సరైన చెట్లను ఎంపిక చేస్తారు. ఈ యాత్రలో ఆలయ సేవకులు , పూజారులు , సంబంధిత అధికారులు అడవుల్లోకి వెళ్లి, నిర్దిష్ట పవిత్ర ప్రమాణాలు (దిశ, మట్టి రకం, చెట్టు లక్షణాలు) ఆధారంగా చెట్లను గుర్తిస్తారు.
పూరి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు! మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి!
రథాల నిర్మాణం
రథాల నిర్మాణానికి మహారాణా సేవకులు అనే వారసత్వ కుటుంబాలకు చెందిన నైపుణ్యం గల వండ్రంగులు ప్రధాన పాత్ర పోషిస్తారు. తయారీ ప్రక్రియ వారు నిర్వహిస్తారు. ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) సహకారంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. చెక్క రకాలు
ప్రధాన రకాలు - ఫాసి, ధౌరా/ధాస, అసన/భౌన్ర, ఇతర నిర్దిష్ట చెట్లు...మొత్తం 10 నుంచి 12 రకాల చెక్కలను ఉపయోగిస్తారు. ఫాసి చెక్క ప్రధానంగా చక్రాలకు ఉపయోగిస్తారు. దసపల్ల, రాణాపూర్, ఒడిశాలో ఇతర అడవుల నుంచి మహానదిలో రాఫ్ట్‌లుగా తేల్చి పూరికి తీసుకొస్తారు. వీటిని ఒడిశా ప్రభుత్వం (అటవీ శాఖ) ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని లాగ్స్...ప్రైవేట్ భూముల నుంచి కూడా వస్తున్నాయి.
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
రథాల తయారీకి ఎన్ని రోజులు సమయం?
ఏటా అక్షయ తృతీయ ( ఏప్రిల్/మే) నుంచి ప్రారంభమై రథయాత్ర వరకూ సాగుతుంది. అంటే సుమారు నెలన్నర నుంచి రెండు నెలలు. వడ్రంగులు, సహాయకులు, చిత్రకారులు..మొత్తం 150 నుంచి 200 మంది తయారీలో పాల్గొంటారు.
మేకుల్లేకుండా రథం తయారీ!
45 రోజులకు పైగా సాగే రథం నిర్మాణం పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతుంది. ఎక్కడా మేకులు ఉపయోగించరు. ప్రాచీన కట్టడ పద్ధతిని ఉపయోగిస్తారు. చెక్కలను ఇంటర్‌లాకింగ్ జాయింట్స్ చేస్తారు..అంటే ప్రతి చెక్క ముక్కను ఫజిల్ లా మార్చి ఒకదానితో మరొకటి అమర్చి గట్టిగా కలిపి ఉంచుతారు. ప్రాచీన శిల్పశాస్త్రం ప్రకారం చెక్కలను సహజంగా లాక్ చేస్తారు. బలమైన తాళ్లు ఉపయోగించి మరింత బలంగా మార్చుతారు. కొన్నిచోట్ల ఇనుప క్లాంప్స్, పిన్స్ లేదా రింగ్స్ వాడతారు..కానీ ప్రధాన నిర్మాణంలో మేకులు వినియోగించరు.
జగన్నాథ రథయాత్రకు రథాలు సిద్ధం చేయడం ఇంజినీరింగ్ కాదు..భక్తి, సంప్రదాయం, శిల్పశాస్త్రం కలయిక. ఈ పద్ధతి వల్ల రథం బలంగా ఉంటుంది. రథయాత్ర తర్వాత కూడా విడదీసినప్పుడు జాయింట్స్ సులభంగా విప్పవచ్చు.
రథం తయారీకి వినియోగించగా మిగిలిన చెక్క ముక్కలను ఆలయ వంటగదిలో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారవుతాయి.
