Puri Jagannath Rath Yatra: జగత్తును ఏలే జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరీ. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలసి కొలువయ్యాడు ఇక్కడ. ఏడాదికి ఓసారి ఆషాఢమాసంలో రథయాత్ర అత్యంత ప్రత్యేకం. హిందువులు మాత్రమే కాదు..చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. పూరీ దర్శించేవారు కేవలం రథయాత్ర కోసం మాత్రమే కాదు సమీపంలో చాలా సందర్శనీయ స్థలాలున్నాయి..అవేంటంటే..
గోల్డెన్ బీచ్
ఆలయానికి సమీపంలో ఉండే బీచ్ ను గోల్డెన్ బీచ్ అంటారు. ఇక్కడ నిత్యం పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు పర్యాటకులు. ఏ బీచ్ లో అయినా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం బీచ్ లో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. పూరీ బీచ్ అయితే బంగారంలా మెరిసిపోతుంది. అందుకే గోల్డెన్ బీచ్ అని పిలుస్తారు. గోల్డెన్ బీచ్ కేవలం ఆధ్యాత్మికపరంగా ఆకర్షించే ప్రదేశం మాత్రమే కాదు..పర్యాటకులను అట్రాక్ట్ చేసే ప్రదేశం కూడా. రథయాత్ర సమయంలో ఈ బీచ్ మరింత రద్దీగా ఉంటుంది
చిలికా సరస్సు
జగన్నాథుడి ఆలయం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది చిలికా సరస్సు. ఏటా చలికాలంలో వలస పక్షుల సందడి కనిపిస్తుంది ఇక్కడ. ఈ సమయంలో సైబీరీయన్ పక్షులు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. నలబానా పక్షుల అభయారణ్యం ఈ సమీపంలో ఇక్కడే ఉంది.
కోణార్క్ సూర్య దేవాలయం
యునెస్కో గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయం.. జగన్నాథ ఆలయానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. అన్నివయసుల వారికి దశలవారీగా విఙ్ఞానాన్ని అందిస్తుంది కోణార్క్ ఆలయం. రెండు అడుగుల ఎత్తులో పిల్లలకు కనిపించే విధంగా వివిధ రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ బొమ్మలకు పై భాగంలో సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటూ రాజకీయం, యుద్ధ కళలు, శిక్షలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి. కాలాన్ని సూచిస్తూ 24 చక్రాలు, 7 గుర్రాలు ఉన్నాయి. సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం
పూరీ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం. ప్రతి శని, ఆదివారాల్లో ఇది మూసివేసి ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఈ మ్యూజియంలో ఉన్న చెక్క కళాఖండాలు, శిల్పాలు, పెయింటింగ్‌లు, హస్తకళా వస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి. లోకనాథ ఆలయం
పూరీ నగరంలో ప్రసిద్ధ ఆలయం ఇది. పంచలింగాల్లో ఒకటిగా భావించే ఇక్కడి శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది
ఆర్ట్ విలేజ్
ఒడిశాలో పూరీకి సమీపంలో ఉండే రఘురాజ్ పూర్ అనే ఆర్ట్ విలేజ్ గా ప్రసిద్ధి చెందింది.వటచిత్ర కళకలు ఈ ప్రదేశం అత్యంత ప్రత్యేకం
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి