London Ahmedabad Flight Cancel | అహ్మదాబాద్: జూన్ 12 ప్రమాదం తరువాత నడవాల్సిన తొలి అహ్మదాబాద్ - లండన్ ఎయిరిండియా విమానం రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-159 చివరి నిమిషంలో రద్దు చేశారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం బయలుదేరాల్సి ఉన్నది. అయితే టెక్నికల్ రీజన్స్‌తో అహ్మదాబాద్- లండన్ ఎయిరిండియా విమానాన్ని రద్దు చేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. అసలేం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఉదయం 11 గంటల వరకు ఫ్లైట్ బయలుదేరుతుందని తమకు చెప్పారని ప్రయాణికులు తెలిపారు. అంతలోనే విమానం కండీషన్ సరిగ్గా లేదని టెన్నికల్ ప్రాబ్లం ఉందని కొందరు చెప్పారు. ముందస్తు చెకింగ్ పూర్తికాలేదని విమానం రద్దు అయిందని చెబుతున్నారని ప్రయాణికులు వాపోయారు. చివరి నిమిషంలో అహ్మదాబాద్ లండన్ విమానం రద్దు గురించి తెలిసింది. చివరి నిమిషంలో చెబుతున్నారు అంటే ప్రయాణికుల భద్రతా గురించి ఇంకా సరైన చర్యలు తీసుకుంటున్నారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.
100 శాతం రీఫండ్.. లండన్ నుంచి అమృత్‌సర్ విమానం సైతం రద్దు
‘అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం రద్దు చేశాం. ప్రయాణికులకు హోటల్ వసతిని అందిస్తున్నాము. ప్రయాణీకులు రద్దు చేసుకుంటే వారికి 100 శాతం రీఫండ్ ఇస్తాం. లేదా ఉచిత రీషెడ్యూలింగ్ ఎంచుకుంటే ఆ సౌకర్యమైనా కల్పిస్తాం. జూన్ 17న లండన్ గాట్విక్ నుంచి అమృత్సర్‌కు బయలుదేరాల్సిన AI170 విమానం రద్దు అయింది" అని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎయిరిండియా ప్రయాణం చేయవద్దు.. ప్రయాణికుడి ఆవేదనANIతో ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ, ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయవద్దు. కొన్ని గంటల కింద లండన్ గాట్విక్ వెళ్లడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ బయలుదేరే సమయంలో సర్వీసు రద్దు అయింది అన్నారు. ఎందుకు విమానం రద్దు చేశారని అడిగితే సమాధానం లేదు. సిబ్బందికే విమానం సర్వీసు గురించి తెలియకపోతే సామాన్య ప్రయాణికులకు ఎలా తెలుస్తుంది. నేను పాట్నా నుంచి వస్తున్నాను. కుటుంబంతో కలిసి వచ్చాను. మమ్మల్ని హోటల్ కు వెళ్లమంటున్నారు. కుటుంబ సభ్యులకు షెల్టర్ ఎవరు ఇస్తారు. రీఫండ్ గురించి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆన్‌లైన్‌లో చెక్ చేయాలని చెప్పారు. గట్టిగా నిలదీస్తే మా పీఎన్ఆర్ నెంబర్, వివరాలు రాసుకున్నారు. వెంటనే రీఫండ్ రాకపోతే, వేరే ఫ్లైట్ సర్వీసు ఏర్పాటు చేయకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఎవరూ ఎయిరిండియాలో టికెట్లు బుక్ చేయవద్దు. ఇందులో ప్రయాణం చేయవద్దు’ అని ఆ ప్రయాణికుడు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
కొన్ని గంటల తరువాత సైతం విమానం అందుబాటులో ఉండదని చెబుతున్నారంటూ మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఎక్కిన మమ్మల్ని చివరి నిమిషంలో కిందకి దించుతున్నారు. విమాన ప్రయాణం అంటే ముఖ్యమైన పనులుంటాయి. కానీ చివరి నిమిషంలో రద్దు చేసి, కనీసం సరైన కారణం చెప్పకపోవడం దారుణం అన్నారు.
జూన్ 12 కూలిన ఎయిరిండియా విమానంఅహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా, ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు.