Shardiya Navratri 2025: నవరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపిణిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపవాసం కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, ఇది ఒక లోతైన సాధన. ఈ నవరాత్రులను ప్రధాని మోదీ తన జీవితాన్ని క్రమశిక్షణతో కూడిన ప్రయోగశాలగా మార్చుకుంటారు. ఈ ఉపవాసం ఆయనకు శరీరం కంటే మనస్సు ,ఆత్మను నియంత్రించే ఒక సాధనం.

Continues below advertisement

మోదీ ఉపవాసాన్ని సాధనగా ఎందుకు భావిస్తారు?

ప్రధాని మోదీ నవరాత్రి తొమ్మిది రోజులు తన జీవితంలో అత్యంత పవిత్రమైన రోజులు అని చెబుతారు. ఆహారాన్ని త్యజించడం వల్ల ఆయన ఆకలితో ఉండటమే కాకుండా, ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.ఇది సాధారణ ఉపవాసం కాదు.. ఇక్కడ ఆకలి బాధ ఆత్మబలంగా మారుతుంది.

Continues below advertisement

ఒక పండు మాత్రమే తింటారు ప్రధాని మోదీ ఉపవాసం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో కేవలం ఒక పండు మాత్రమే తింటారు. నవరాత్రులు అదే అనుసరిస్తారు. బొప్పాయి,  ఆపిల్ లేదంటే కొన్నిసార్లు కేవలం కొబ్బరి నీరు మాత్రమే తీసుకుంటారు. ఈ పద్ధతి శరీరంపై నియంత్రణ సాధించడంతో పాటూ మనసుని ఏకాగ్రతగా ఉంచుంతుంది. తినే ఆహారంలో రుచులు కోరుకున్నప్పుడు శరీరంపై నియంత్రణ కోల్పోయినట్టవుతుందంటారు. నీటితో గడిపే రోజులున్నాయి

కొన్నిసార్లు...నవరాత్రి మొత్తం గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకుంటారు. అత్యంత బిజీగా ఉంటే మోదీ ఇవన్నీ పాటించడం ఎలా సాధ్యం అనుకోవచ్చు కానీ ఇది మోదీకి పరమ సంయమనం. ఇక్కడ శరీరం యొక్క శక్తి లోపలి శుభ్రతకు ఉపయోగపడుతుంది. మనసుని శుద్ధి చేస్తుంది. సాధారణతలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం

ఉపవాసం కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహారం చాలా సాధారణమైనది. మునగ పరాటా, వేప ఆకులు, మిశ్రీ, కిచిడి , తేలికపాటి ఆహారం. ఇవన్నీ అతని దినచర్యలో భాగం. యోగా, ధ్యానం,నడకతో పాటు...ఆరోగ్యం  ఆధ్యాత్మికతను జీవితానికి ఆధారంగా భావిస్తారని మోదీ దినచర్య నిరూపిస్తుంది.

సంయమనమే అసలైన శక్తి

ఢిల్లీలో ఈమధ్యకాలంలో కలుషిత ఆహారం తిని వందలమంది అనారోగ్యం పాలయ్యారు.  ఇది ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త  పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసింది. మోదీ క్రమశిక్షణతో కూడిన  నియంత్రిత ఉపవాసం నవరాత్రి సందేశం కేవలం దేవి భక్తి మాత్రమే కాదు, స్వీయ నియంత్రణే మనపై మనం సాదించే విజయం అని మనకు నేర్పుతుంది.

నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతమైన సందేశం

ప్రధాని మోదీ నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతంగా ఒక సందేశాన్ని ఇస్తుంది, సంయమమే గొప్ప ఆయుధం. ప్రజలు ఉపవాసాన్ని నమ్మకంతో  చేస్తే.. ప్రధాని మోదీ దానిని స్వీయ-క్రమశిక్షణ తపస్సుగా మార్చుకుంటారు. అందుకే ఆయన ఉపవాసం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంది, ఎందుకంటే ఇది ఆకలిని త్యజించడం మాత్రమే కాదు, మనస్సు .. ఆత్మ యొక్క లోతైన సాధన కూడా.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.