Sri Lalitha Tripura Sundari  Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ...బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, శ్రీ కాత్యాయనీ, మహాలక్ష్మి  దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో ఆరో రోజైన సెప్టెంబర్ 27  శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా  దర్శనమిస్తోంది.

Continues below advertisement

ప్రాత: స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవతగా కొలుస్తారు. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితాదేవి. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపు శ్రీ మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. లలితా అమ్మవారి దర్శనం  దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.

Continues below advertisement

ఈరోజు  లలితా త్రిపుర సుందరీ దేవిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఎర్రటి పూలతో పూజించాలి. అప్పాలు, పులిహోర, రవ్వ కేసరి మీ శక్తిమేకు నైవేద్యం  సమర్పించాలి. త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థం. భండాసుర సంహారం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి భీకరమైన యుద్ధం చేసింది. త్రిపుర సుందరీదేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 

ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకి ఇమిడి ఉన్నాయి..శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 రూపాల్లో ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. వీటన్నింటిలోనూ మరో శక్తి ఇమిడి ఉంటుంది..ఆ శక్తినే లలితగా భావిస్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఓజోన్‌ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని శ్రీ సూక్తం (హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం) ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గతం అని చెబుతారు. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్‌ పొర. ఈ ఓజోన్‌ పొరకు బయట జ్వలంతిగా లోపలివైపు ఆర్ద్రగా కనిపిస్తుంది. భూమిని శివలింగంగా భావిస్తే దానిచుట్టూ ఆవరించి ఉన్న  అమ్మవారు లలిత. దీనికి సింబాలిక్ గానే లలితా త్రిపుర సుందరి ఫొటోస్ లో శివుడిపై కూర్చున్న అమ్మవారిని చూస్తుంటాం.

లిలతా అమ్మవారి ఉపాసన సౌమ్యత్వాన్ని పెంచుతుంది. శ్రీచక్ర స్థితంగా కనిపించే  లలితా త్రిపుర సుందరి  శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి 3 పురాలు. ఈ త్రిపురాలలో ఉండే రాక్షసత్వం (త్రిపురాసురులు) తొలగించుకుంటే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలుగుతుంది. పాంచభౌతికశక్తి సమాహారమైన అమ్మవారిని తత్త్వాన్ని ఉపాసిస్తే  ఈ  పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాల్లోను అనంతమైన శక్తి చేకూరుతుంది. 

గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.