Tulsi In Home: హైందవ సంస్కృతిలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా, భగవత్ స్వరూపంగా పరిగణిస్తారు. నిత్యం ఉదయం, సాయంత్రం పూజిస్తారు. తులసి మొక్కలో సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసి పూజ మహాలక్ష్మిని, విష్ణువును ప్రసన్నం చేస్తుందని భావిస్తారు. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే అశుభ ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది.
1. పనిలో పురోగతి
ఏకాగ్రత, తదేక దీక్షతో ఎంత పని చేసినా ఆ పని చెడిపోతుంటే ఇంట్లో కృష్ణ తులసి మొక్కను నాటండి. ఆ తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఆ తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు త్వరలోనే తొలగిపోతాయి.
Also Read : తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది
2. తులసితో అరటి మొక్కను నాటండి
ఇంట్లో తులసి మొక్క ఉంటే దానితో పాటు అరటి మొక్కను కూడా నాటవచ్చు. రెండు మొక్కలు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి. రెండు మొక్కలకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నులవుతుంది.
3. కుబేరుని దీవెనలు
కార్తీక మాసంలో 30 రోజులు తులసి మొక్క కింద నెయ్యి దీపం వెలిగించాలి. మీరు దీపం వెలిగించలేకపోతే, దేవోత్థాన ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు కనీసం ఐదు రోజులు దీపం వెలిగించండి. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది.
4. తులసి ఏ దిశలో ఉండాలి
తులసికి నీళ్లు నైవేద్యంగా సమర్పించడమే కాకుండా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిక్కును దేవతలకు నిలయంగా పరిగణిస్తారు.
5. తులసి కోటకు ఈ చిహ్నాలు ఉండాలి
ఈ చిహ్నాలను తులసి కోట దగ్గర లేదా తులసి మొక్క ఉన్న చోట ఉంచడం చాలా శుభదాయకమని లేదా శుభప్రదమని చెబుతారు. ఆ సంకేతాలు ఏమిటంటే
- స్వస్తిక్
- ఓం
- శంఖం
- చక్రం
Also Read : ఇంటి ముందున్న తులసి మొక్కను చూసి ఇంట్లో ఏం జరగబోతోందో తెలిసిపోతుందట... నిజమేనా!
మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే పైన చెప్పిన పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తులసికి మన జీవితంలోని అనేక సమస్యలను నయం చేసే శక్తి ఉంది. ఈ కారణంగా, ఇంట్లో కనీసం ఒక తులసి మొక్కను ఉంచండి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.