Pitra Paksha Vastu Tips: పితృ పక్షాన్ని హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఇది పూర్వీకులను స్మరించుకుని, వారిని గౌరవించి ఆశీర్వాదం పొందే సమయం. ఈ సమయంలో, ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని వాస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది, మనశ్శాంతి పెరుగుతుంది. ప్రతి రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఇందుకోసం కొన్ని సాధారణ వాస్తు చిట్కాలు అనుసరించాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు 1. తూర్పు లేదా ఉత్తర దిశలో పూజా స్థలం ఉంచండి
ఇంటి పూజా స్థలాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉండేలా చూసుకోవాలి. ఈ దిశల నుంచి సానుకూల శక్తి వస్తుంది. ఈ సమయంలో పితృ పక్షంలో దీపం వెలిగించడం మీ పూర్వీకుల చిత్రం లేదా స్మారక స్థలంపై పువ్వులు ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
2. ఇంటిని శుభ్రపరచండి , గందరగోళం లేకుండా చూసుకోండి
ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచితే వాస్తు ప్రకారం ప్రతికూలత పెరుగుతుంది. పితృ పక్షం ప్రారంభానికి ముందే ఇంటి ప్రతి మూలను శుభ్రపరచండి. ముఖ్యంగా పూజా స్థలం, తూర్పు , ఉత్తర దిశల గదులు మరియు ప్రధాన ద్వారాలను శుభ్రంగా ఉంచండి.
3. నీటి సరైన స్థానం
ఇంట్లో నీటి సానుకూల దిశ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఈ దిశలో ఫౌంటెన్ లేదా వాటర్ ప్లాంట్ ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. పితృ పక్షంలో, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పూర్వీకుల పేరుతో ఇంటి ప్రధాన ద్వారం లేదా పూజా స్థలంలో ఉంచడం కూడా శుభప్రదం.
4. దానం, పుణ్య కార్యాలు చేయండి
పితృ పక్షంలో పేదలకు, అవసరం అయినవారికి ధాన్యం, బట్టలు లేదా డబ్బు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో సుఖశాంతులను పెంచుతుంది..అభివృద్ధికి బాటలు వేస్తుంది
5. అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి బయటపడేయండి
పాత, విరిగిన, పనికిరాని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఈ సమయంలో వాటిని దానం చేయండి లేదా ఇంట్లోంచి బయటపడేయండి. ఇంటిని ఓ క్రమబద్ధంగా ఉంచడం వల్ల మనశ్శాంతి సానుకూలత పెరుగుతుంది.
పితృ పక్షం అనేది పూర్వీకులను గుర్తుచేసుకునే సమయం మాత్రమే కాదు, మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకురావడానికి కూడా ఒక అవకాశం. ఈ సాధారణ వాస్తు చర్యలను అనుసరించడం ద్వారా, మీరు మీ కుటుంబంలో సుఖం, శాంతి , అభివృద్ధిని తీసుకురావచ్చు. చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.
సెప్టెంబర్ 07న ప్రారంభమయ్యే పితృపక్షం.. 15 రోజులపాటూ సాగి మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. ఈ రోజు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.. ఆ మర్నాటి నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఉత్తరాదిన ఇది ఆశ్వయుజ అమావాస్య అయితే..దక్షిణాదిన మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి దక్షిణాదిన ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.