Marraige: ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లంటే నో అనే వారి సంఖ్య పెరుగుతోంది. డేటింగ్ కల్చర్ రావడంతో పెళ్లి, పిల్లలు, బాధ్యతలంటే ఓ అడుగు వెనక్కే వేస్తున్నారు. ఏదో ఒక తోడుంటే చాల్లే అనుకుంటున్నారు. అయితే పెళ్లెందుకు చేసుకోవాలి? చేసుకోపోతే ఏమవుతుందో మీకు తెలుసా?
28-06-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
పెళ్లి అంటే ఉత్సవం కాదు..ప్రతి వ్యక్తి జీవితంలో అనుసరించాల్సిన 16 సంస్కారాలలో ప్రధానమైనది. సానపెట్టడం వల్ల వజ్రం ప్రకాశించినట్టు సంస్కారాలు పూర్తిచేస్తేనే ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ జన్మకో సార్థకత లభిస్తుంది.
పెళ్లెందుకు చేసుకోవాలి? భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు...
1. ఋషిఋణం , 2. దేవఋణం, 3. పితౄణం
ఈ మూడు రుణాలు అందరూ తీర్చాల్సిందే..లేదంటే మరో జన్మ తప్పదు. మానవ జన్మకు సార్థకత ఉండదు. అందుకే ఈ మూడు రుణాల నుంచి విముక్తి లభించాలంటే పెళ్లిచేసుకోవాల్సిందే.
"బ్రహ్మచర్యేణ ఋషిభ్యః"
" యజ్ఞేన దేవేభ్యః"
"ప్రజయా పితృభ్యః"
ఏలినాటి శని 2027 హెచ్చరిక! 2 రాశులవారికి భయం - ఓ రాశి వారికి అభయం , పవర్‌ఫుల్ రెమెడీస్
ఋషి ఋణం
బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి ఋణం తీర్చుకోవాలి. నిత్యం దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి, పురాణాలను అధ్యయనం చేసి తర్వాత తరానికి అందించాలి
దేవఋణం
యజ్ఞ యాగాలు చేయడం ద్వారా దేవరుణం తీరుతుంది. యజ్ఞం వల్ల దేవతలు తృప్తి చెందుతారు, సకాలంలో వానలు కురిపిస్తారు, పంటలు వృద్ధి చెందుతాయి, కరువు తొలగిపోతుంది. నీరు గాలి వెలుగు ఆహారం ప్రసాదించే దేవతల రుణం తీర్చుకోవడమే దేవరుణం పితౄణం
మంచి సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం తీరుతుంది. వంశాన్ని కొనసాగించేందుకు, పతృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానానికి జన్మనివ్వాలి. సంతానం కలగాలంటే వివాహం తర్వాతే ..."ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అని చెబుతుంది వేదం. అంటే వంశపరంపరను తెంచేయవద్దని అర్థం. పున్నామ నరకం నుంచి తప్పించుకుని ఉత్తమ గతులు లభించాలంటే సంతానం ఉండాలని చెబుతోంది వేదం.
పెళ్లి చేసుకోకుంటే స్వర్గంలో ఎంట్రీ ఉండదా?
నైష్ఠిక బ్రహచర్యం - పెళ్లి చేసుకోకుండా జీవితాంతం భగవంతుడి చింతలో , సమాజ సేవలో గడిపేవారిని నైష్ఠిక బ్రహ్మచారులు అంటారు. భీష్ముడు, హనుమంతుడు, ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద వీరు ఈ కోవకు చెందుతారు..వీరంతా ఉత్తమ గతులు పొందినవారే. ఒక వ్యక్తి తన కర్మలను స్వార్థం లేకుండా ఆచరిస్తూ , భగవంతుడిపై పరిపూర్ణ భక్తిని కలిగి ఉంటే వారికి పెళ్లితో సంబంధం లేకుండా మోక్షం సిద్ధిస్తుందని చెబుతోంది భగవద్గీత కేవలం శారీరక సంబంధం కోసం కాదు.. మనస్సును వికసింపజేసుకోవడానికి పెళ్లి సాధన మాత్రమే..ఆ మనసును నేరుగా భగవంతుడిపై లగ్నం చేస్తే వారికి వివాహం అవసరం లేదు..స్వర్గంలో చోటు దక్కకపోవడం ఉండదు. అందుకే.. పెళ్లి చేసుకోపోతే స్వర్గం ఉండదు అనే నియమం... సాధారణ సంసార జీవితం గడపాలి అనుకునేవారి, బాధ్యతల నుంచి పారిపోయేవారికి హెచ్చరిక. కానీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి..సమాజానికి మంచి చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే వారికి స్వర్గమే కాదు మోక్షం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. స్వర్గం-నరకం అనేవి మనం ఆచరించే కర్మల ఆధారంగా ఉంటాయి కానీ వివాహంపై కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు.
మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
