Rajamouli About Mahesh Babu Varanasi Story : వారణాసి... మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్. ఫస్ట్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ కాగా... ఈ మూవీ స్టోరీపై గతంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా మూవీ కథలో ఓ పార్ట్‌ను లీక్ చేశారు. కుంభకర్ణుడు, శ్రీరాముడి మధ్య వార్ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు స్వయంగా జక్కన్నే వారణాసి అసలు స్టోరీని లీక్ చేశారు.
అసలేంటీ వారణాసి?
ప్రస్తుతం రాజమౌళి ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్‌లో వారణాసి గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా... వారణాసి స్టోరీ గురించి ఆయన ఇచ్చిన లీక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎవరూ ఊహించని ఓ ప్లాట్‌ను చెప్పడంతో అంచనాలు పదింతలు కాదు అంతకు మించి అనేలా ఉన్నాయి.
'వారణాసి' భారీ యాక్షన్ అడ్వెంచర్ అని అనుకుంటున్నప్పటికీ... సినిమాలో ఎమోషనల్ మూమెంట్ మూలం అని రివీల్ చేశారు జక్కన్న. 'సినిమాలో మీరు ఆఫ్రికా దట్టమైన అడవుల వన్యతను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంటార్కిటికాలో చలిని, మంచును అనుభూతి చెందుతారు. రామాయణంలోని దేవుళ్లను చూస్తారు. ప్రకృతి విపత్తులను చూస్తారు. అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ని ఉన్నా దీనికి మూలం మాత్రం భారతీయల ఆత్మ లాంటి ఎమోషనే. తండ్రీ కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ నుంచే ఇవన్నీ వస్తాయి.' అంటూ రివీల్ చేశారు.
Also Read : Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
తండ్రి ఎవరు?
తండ్రీ కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ అని రాజమౌళి రివీల్ చేయగానే... మహేశ్ బాబుకు తండ్రిగా నటించింది ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మూవీలో ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నట్లు అప్పట్లో కన్ఫర్మ్ చేశారు. అయితే, తాను శివ భక్తుడిగా నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈయనే తండ్రి రోల్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దూకుడులో ప్రకాశ్ రాజ్, మహేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఈ మూవీలోనూ ప్రకాశ్ రాజే తండ్రి అయి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి మెయిన్ స్టోరీ రివీల్ చేయడంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మూవీ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి చెప్పారు. సినిమాల క్లిష్టమైన, మెయిన్ సీన్స్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యిందని తెలిపారు.
సినిమాలో మహేశ్ బాబు రుద్రుడిగా, శ్రీరాముడిగా నటిస్తున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
