శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 26 మంగళవారం పంచాంగం


తేదీ: 26-07 -2022
వారం:  మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  : త్రయోదశి మంగళవారం సాయంత్రం 6.08 వరకు తదుపరి చతుర్ధశి
నక్షత్రం:  ఆరుద్ర రాత్రి తెల్లవారుజామున 4.24 వరకు తదుపరి పునర్వసు
వర్జ్యం :  ఉదయం 11.07 నుంచి 12.53 వరకు 
దుర్ముహూర్తం :  ఉదయం 8.22 నుంచి 9.06 వరకు తిరిగి 10.57 నుంచి 11.42 వరకు  
అమృతఘడియలు  :  సాయంత్రం 6.19 నుంచి 7.05 వరకు  
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:32


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఈ రాశులవారి స్థిరాస్తులు,వాహనం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి 25 జూలై నుంచి 31 జూలై 2022 వరకు వార ఫలాలు


మాస శివరాత్రి సందర్భంగా  సదాశివాష్టకమ్ (పతంజలి కృతం) Sadashiva Ashtakam


సువర్ణపద్మినీతటాంతదివ్యహర్మ్యవాసినే
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || 


సతుంగ భంగ జహ్నుజా సుధాంశు ఖండ మౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండలాయ పుణ్యశాలిబంధవే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || 


చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || 


రన్నిశాకర ప్రకాశ మందహాస మంజులా-
ధరప్రవాళ భాసమాన వక్త్రమండల శ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౪ ||


సహస్ర పుండరీక పూజనైక శూన్యదర్శనా-
త్సహస్రనేత్ర కల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || 


రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్ర చాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాజనున్నవేదరూపవాజినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ||


అతి ప్రగల్భ వీరభద్రసింహనాద గర్జిత
శ్రుతిప్రభీత దక్షయాగ భోగినాక సద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ||


మృకండుసూను రక్షణావధూతదండపాణయే
సుగంధమండల స్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || 


మధురిపువిధి శక్ర ముఖ్యదేవైరపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం రజత సభాపతయే నమశ్శివాయ || 
హాలాస్యనాథాయ మహేశ్వరాయ హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ నమో నమస్సుందరతాండవాయ || 


ఇతి శ్రీ హాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |


Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి


Also Read: రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!