Nagula Chavithi 2025 Puja Muhurat : దీపావళి అమావాస్య తర్వాత నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో నాలుగోరోజు వచ్చే చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. కొందరు నాగులచవితిని శ్రావణమాసంలో జరుపుకుంటారు. పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలున్నాయి.
చాలా ఆలయాల్లో నాగప్రతిమలు కనిపిస్తాయి. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తే సకల రోగాల తొలగిపోతాయని, దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
పుట్టతో పోల్చే మనిషి శరీరానికి నవరంధ్రాలుంటాయి. నాడులతో నిండిన వెన్నుముకను వెన్నుపాము అని పిలుస్తారు. మూలాధారచక్రంలో కుండలినీ శక్తి పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రంలో ఉంది. ఇది మనిషిలో నిద్రను నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ సత్వగుణాన్ని హరించేస్తుంది. అందుకే నాగుల చవితి రోజు విష సర్పాన్ని ఆరాధిస్తే మనిషిలో విషం తొలగిపోయి శేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు.
ఇక జ్యోతిష్య శాస్త్రపరంగా కుజుడు, రాహువు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు... పుట్టలో పాలు పోస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు 2025 లో నాగులచవితి అక్టోబర్ 25 శనివారం వచ్చింది. ఈ రోజు మొత్తం పాలు పోయొచ్చు..కేవలం వర్జ్యం,దుర్ముహూర్తం లేని సమయాలు చూసుకుంటే చాలు.. అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల 1 నిముషం నుంచి చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
అక్టోబర్ 25 శనివారం రాత్రి 12 గంటల 3 నిముషాల వరకూ చవితి ఘడియలున్నాయి
అక్టోబర్ 25 వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల నుంచి ఒంటిగంట 50 నిముషాల వరకూ ఉంది
అక్టోబర్ 25 ఉదయం దుర్ముహూర్తం ఉదయం ఏడున్నరవరకూ ఉంది.. అంటే ఉదయం ఏడున్నర తర్వాత... మధ్యాహ్నం 12 గంటలలోపు...తిరిగి 2 తర్వాత ఎప్పుడైనా పుట్టలో పాలు పోయొచ్చు
పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకోండి నన్నేలు నాగన్న , నాకులమునేలు నాకన్నవారల నాఇంటివారనేలుఆప్తమిత్రులనందరిని ఏలు పడగ తొక్కిన పగవాడనుకోకు నడుము తొక్కిన నావాడనుకోతోక తొక్కితే తొలిగిపో వెళ్లిపోఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇవ్వుఅని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు
ప్రార్థన
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
నాగులచవితిరోజున ఈ శ్లోకం పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
కార్తీక మహాపురాణం కథ DAY-1.. కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కార్తీక మహాపురాణం కథ DAY-2 బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం, కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి