Singarayakonda Narasimha Swamy Temple : భారీగా సంపాదించినా..కోట్ల ఆస్తులున్నా..ఎంత గొప్పోళ్లైనా..ఎవ్వరైనా భగవంతుడి ముందు తగ్గాల్సిందే. భక్తులకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..కానీ ఏకంగా ఓ ఊరు ఊరంతా తగ్గుతూనే వస్తున్నారు. తరతరాలుగా ఇదే సంప్రదాయం పాటిస్తున్నారు. దేవుడిపై ఉన్న భయమో-భక్తో కానీ పూర్వకాలం నుంచి పెద్దలు అనుసరిస్తున్న కట్టుబాటుని దాటే సహసం ఎవరూ చేయడం లేదు. 

ఎక్కడుందా వింతగ్రామం? 

ఊరి పేరు పాత సింగరాయకొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా  సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊర్లో నివాసం ఉండేవారంతా బాగా స్థిరపడినవారే..అంటే ఆర్థికంగా ఓ అడుగుపైన ఉన్నవారే. కానీ ఈ ఉర్లో ఎక్కడా బహుళ అంతస్తుల భవనాలు కనిపించవు. అంతెందుకు..కనీసం ఇంటికి సెకెండ్ ఫ్లోర్ వేయరు. ఎన్ని కోట్లు మూలుగుతున్నా, ఎంత సంపాదించినా తరతరాలుగా ఇదే కట్టుబాటును అనుసరిస్తున్నారు.  

కారణం ఏంటి? తరతరాలుగా వాళ్లు అనుసరిస్తున్న నియమం ఏంటి?

పాత సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారంటే స్థానికులకు ఎంతో భక్తి. ఎంత అంటే..ఈ ఊర్లో ఉండే ఒక్క నివాసం కూడా స్వామివారి ఆలయాన్ని మించిన ఎత్తులో ఉండకూడదు. తరతరాలుగా ఇదే నియమం పాటిస్తున్నారు. ఒకప్పుడు పూరిపాకలు ఉండేవి, ఆ తర్వాత అవి పెంకుటిల్లుగా మారాయి..ఆ తర్వాత డాబాలొచ్చాయి..అంతే..అక్కడితోనే ఆగిపోయారు. మరో ఫ్లోర్ అదనంగా వేసే సాహసం మాత్రం చేయలేదు. స్వామివారి ఆలయం కన్నా ఏ ఇల్లు కూడా ఎత్తుగా కనిపించకూడదు అనే నియమానికి కట్టుబడి ఉండిపోయారు.  

గుళ్ల చుట్టూ అల్లుకున్న ఊర్లు

ఒకప్పుడు అక్కడో గ్రామం ఉందని దూరంనుంచి వచ్చేవారికి తెలిపే సిగ్నల్ ఆలయం. ఆలయం ధ్వజస్తంభం, గోపురం చూసి ఇక్కడో గుడి ఉందంటే నివాసాలున్నాయని అర్థం చేసుకునేవారు బాటసారులు. పైగా ఎక్కడైనా ఆలయం ఉందంటే..ఆ చుట్టుపక్కల నివాసయోగ్యమైన స్థలంగా భావించేవారు. పండుగలు, వేడుకలు, ఒక్కోసారి పంచాయితీలు కూడా ఆలయం వేదికగానే నడిచేవి. ఇప్పటికీ పాతసింగరాయకొండలో ఇదే పద్ధతి నడుస్తోంది. 

ఇల్లు ఉన్నవాళ్లు మరో ఇల్లు కట్టుకుంటారు కానీ మరో ఫ్లోర్ మాత్రం వేయరు.తాతముత్తాతల నుంచి ఇదే సంప్రదాయం అనుసరిస్తున్నారు. అందుకే వాళ్లని ఫాలో అయిపోతున్నాం అంటారు స్థానికులు  

ఇక్కడ మొత్తం 1500 పైగా నివాసాలున్నాయి. రోడ్ దాటిన తర్వాత మరికొన్ని నివాసాలున్నాయి. వాస్తవానికి ఇది సింగరాయకొండ...కానీ ఊరి పరిధి పెరిగిన తర్వాత కొత్త సింగరాయకొండ అనడం మొదలుపెట్టారు. దీంతో ఈ ప్రదేశం పాతసింగరాయకొండగా స్థిరపడింది. ఇళ్ల సంఖ్య పెరుగుతోంది కానీ పైన మరో ఫ్లోర్ మాత్రం వేయరు అని పంచాయతీ ఆఫీసులో పనిచేసే సోము చెప్పారు. 

డబ్బుల్లేకకాదు.. కానీ స్వామిని మించి ఉండకూడదు అనే నియమం.ఎవరైనా ఆలయ నిర్మాణాన్ని దాటి కడితే ఆ భవనం కూలిపోతుందని అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఓ పెద్దావిడ చెప్పారు .  

వాస్తవానికి మూడు అంతస్తులు నిర్మించినా కొండంత ఎత్తురాదు కానీ పూర్వకాలం నుంచి ఉండిపోయిన నమ్మకం అది. భక్తో, భయమో కానీ ఈ ఊర్లో ఈ సెంటిమెంట్ బలపడిపోయిందంటారు అక్కడున్న పురోహితులు. 

దక్షిణ సింహాచలంగా పిలిచే ఆ ఆలయాన్ని పల్లవులు కట్టించారు...విజయనగరం చక్రర్తులు అభివృద్ధి చేశారని అక్కడున్న శాసనాల్లో ఉంది. 

ఆలయంలో శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదు. గోవిందుడి విగ్రహం , కాళీయమర్థనం , నారసింహస్వామి సహా అన్ని శిల్పాల్లో జీవకళ కనిపిస్తుంది

ప్రతి శనివారం ఇక్కడ భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఆలయం కళకళలాడిపోతుంది.  ఏటా జ్యేష్ఠమాసంలో కన్నులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు..

మొత్తానికి భక్తో-భయమో పాత సింగరాయకొండవాసులు అనుసరిస్తున్న ఈ నియమం ఇప్పటికి అయితే కొనసాగుతోంది..మరి భవిష్యత్ తరాలు కూడా అనుసరిస్తారా?...

భారీగా సంపాదించినాకోట్ల ఆస్తులున్నాఎంత గొప్పోళ్లైనా..ఎవ్వరైనా భగవంతుడి ముందు తగ్గాల్సిందే

భక్తులకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..కానీ ఏకంగా ఓ ఊరు ఊరంతా తగ్గుతూనే వస్తున్నారు. తరతరాలుగా ఇదే సంప్రదాయం పాటిస్తున్నారు. దేవుడిపై ఉన్న భయమో-భక్తో కానీ పూర్వకాలం నుంచి పెద్దలు అనుసరిస్తున్న కట్టుబాటుని దాటే సహసం ఎవరూ చేయడం లేదు. 

ఎక్కడుందా వింతగ్రామం? 

ఊరి పేరు పాత సింగరాయకొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా  సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊర్లో నివాసం ఉండేవారంతా బాగా స్థిరపడినవారే..అంటే ఆర్థికంగా ఓ అడుగుపైన ఉన్నవారే. కానీ ఈ ఉర్లో ఎక్కడా బహుళ అంతస్తుల భవనాలు కనిపించవు. అంతెందుకు..కనీసం ఇంటికి సెకెండ్ ఫ్లోర్ వేయరు. ఎన్ని కోట్లు మూలుగుతున్నా, ఎంత సంపాదించినా తరతరాలుగా ఇదే కట్టుబాటును అనుసరిస్తున్నారు.  

కారణం ఏంటి? తరతరాలుగా వాళ్లు అనుసరిస్తున్న నియమం ఏంటి?

పాత సింగరాయకొండలో నారసింహ స్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారంటే స్థానికులకు ఎంతో భక్తి. ఎంత అంటే..ఈ ఊర్లో ఉండే ఒక్క నివాసం కూడా స్వామివారి ఆలయాన్ని మించిన ఎత్తులో ఉండకూడదు. తరతరాలుగా ఇదే నియమం పాటిస్తున్నారు. ఒకప్పుడు పూరిపాకలు ఉండేవి, ఆ తర్వాత అవి పెంకుటిల్లుగా మారాయి..ఆ తర్వాత డాబాలొచ్చాయి..అంతే..అక్కడితోనే ఆగిపోయారు. మరో ఫ్లోర్ అదనంగా వేసే సాహసం మాత్రం చేయలేదు. స్వామివారి ఆలయం కన్నా ఏ ఇల్లు కూడా ఎత్తుగా కనిపించకూడదు అనే నియమానికి కట్టుబడి ఉండిపోయారు.  

గుళ్ల చుట్టూ అల్లుకున్న ఊర్లు

ఒకప్పుడు అక్కడో గ్రామం ఉందని దూరంనుంచి వచ్చేవారికి తెలిపే సిగ్నల్ ఆలయం. ఆలయం ధ్వజస్తంభం, గోపురం చూసి ఇక్కడో గుడి ఉందంటే నివాసాలున్నాయని అర్థం చేసుకునేవారు బాటసారులు. పైగా ఎక్కడైనా ఆలయం ఉందంటే..ఆ చుట్టుపక్కల నివాసయోగ్యమైన స్థలంగా భావించేవారు. పండుగలు, వేడుకలు, ఒక్కోసారి పంచాయితీలు కూడా ఆలయం వేదికగానే నడిచేవి. ఇప్పటికీ పాతసింగరాయకొండలో ఇదే పద్ధతి నడుస్తోంది. 

ఇల్లు ఉన్నవాళ్లు మరో ఇల్లు కట్టుకుంటారు కానీ మరో ఫ్లోర్ మాత్రం వేయరు.తాతముత్తాతల నుంచి ఇదే సంప్రదాయం అనుసరిస్తున్నారు. అందుకే వాళ్లని ఫాలో అయిపోతున్నాం అంటారు స్థానికులు  

పల్లవుల కాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు కూడా సందర్శించారు..దానాలు చేశారని ఇక్కడ శాసనాల్లో ఉంది. 

ఆలయంలో శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదు. గోవిందుడి విగ్రహం , కాళీయమర్థనం , నారసింహస్వామి సహా అన్ని శిల్పాల్లో జీవకళ కనిపిస్తుంది 

ఇక్కడ మొత్తం 1500 పైగా నివాసాలున్నాయి. రోడ్ దాటిన తర్వాత మరికొన్ని నివాసాలున్నాయి. వాస్తవానికి ఇది సింగరాయకొండ...కానీ ఊరి పరిధి పెరిగిన తర్వాత కొత్త సింగరాయకొండ అనడం మొదలుపెట్టారు. దీంతో ఈ ప్రదేశం పాతసింగరాయకొండగా స్థిరపడింది. సంఖ్య పెరుగుతోంది కానీ పైన మరో ఫ్లోర్ మాత్రం వేయరు అని పంచాయతీ ఆఫీసులో పనిచేసే సోము చెప్పారు. 