Pitru Paksham 2023: పితృ పక్షం సమయంలో ప్రజలు తర్పణ, దాన, శ్రాద్ధ, పిండ దాన వంటి కర్మలను ఆచరిస్తారు. ఈ సమయంలో జంతువులు, పక్షులకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కానీ పితృ పక్షం సమయంలో కొన్ని జీవులు మనకు ప్రత్యేక సూచనలు ఇస్తాయి. మీ పూర్వీకులు మీ చ‌ర్య‌ల కార‌ణంగా సంతోషంగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా అనే విష‌యాన్ని ఈ జీవులు తెలియజేస్తాయి. అంతేకాదు మీరు ఇచ్చే ఆహారాన్ని ఆ జీవులు తింటే మిమ్మ‌ల్ని అదృష్టం వరిస్తుంది. పితృ పక్షంలో ఏ జీవులు అదృష్టాన్ని తెలియజేస్తాయి..


1. ఆవు
హిందూ ధ‌ర్మంలో గోవుకు గౌరవప్రదమైన స్థానం ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఆవులలో దేవతలు నివసిస్తారు. పితృ పక్షం సమయంలో, మీరు ఆవుకు ఆహారం ఇస్తే, మీరు ఇచ్చిన ఆహారాన్ని ఆవు తింటే, అది మీ పితృదేవ‌త‌లకు చెందుతుంది. మీ పూర్వీకులు మీ చ‌ర్య‌ల‌తో సంతోషంగా ఉన్నారని మీకు ప‌రోక్షంగా సంకేతం ల‌భించిన‌ట్టు భావించాలి.


Also Read : పితృ పక్షంలో ఈ 3 వస్తువులు కొంటే త్రిదోషం తప్పదు!


2. కాకి
పితృ పక్షం సమయంలో, తమ పూర్వీకుల శ్రాద్ధం చేసే వారందరూ కాకి కోసం వేచి ఉంటారు. ఎందుకంటే మన పూర్వీకులు కాకుల రూపంలో ఇంటికి వస్తారని నమ్ముతారు. మీరు మీ పూర్వీకులకు ఆహారంలో కొంత భాగాన్ని సిద్ధం చేసిన‌ప్పుడు కాకి వ‌చ్చి తింటే, మీ పూర్వీకులు ఆ ఆహారాన్ని అంగీకరించారని అర్థం చేసుకోండి. మీరు నిర్వ‌హించిన శ్రాద్ధ కార్య‌క్ర‌మంతో మీ పూర్వీకులు సంతోషంగా ఉన్నార‌ని, సంతృప్తి చెందార‌ని తెలుసుకోవాలి. మీ పురోగతి, శ్రేయస్సు, సంతానం, సంపద పెరుగుదల కోసం వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ఇచ్చే ఆహారాన్ని కాకి తినకపోతే, పూర్వీకులు మీపై అసంతృప్తితో ఉన్నారని, మీపై కోపంగా ఉన్నారని అర్థం.


Also Read: పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!


3. చీమలు
పితృ పక్షంలో పూర్వీకుల తిథి సంద‌ర్భంగా ఆహారాన్ని తయారు చేస్తారు. అందులో కొంత భాగాన్ని చీమలకు ఆహారంగా అందిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, పూర్వీకులు చీమల ద్వారా ఆహారాన్ని పొందడం ద్వారా సంతృప్తి చెందుతారు. 


4. కుక్క
పితృ పక్షం సమయంలో పూర్వీకులకు ఆహారాన్ని అందించడానికి, ఆహారంలో కొంత భాగాన్ని వారికి సంబంధించిన తిథుల‌లో కుక్కలకు ఇస్తారు. ఇది ఎక్కువగా నల్ల కుక్కలకు ఇస్తుంటారు. ఇది పూర్వీకుల ఆత్మలను సంతృప్తిపరుస్తుంది. వారు వారి వారసులకు శ్రేయస్సుతో పాటు ఆశీర్వ‌చ‌నం అందిస్తారు.


Also Read : మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!


పితృ పక్షం సమయంలో మనం ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం ఇస్తే, అది నేరుగా మన పితృదేవ‌త‌లకు జమ అవుతుంది. దీని ద్వారా మనము పితరుల ఆత్మకు ముక్తిని ప్రసాదించినవారవుతారు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.