Mahabharatham Summary in Telugu: మహాభారతం మొత్తం చదివారా? మీకు చదవడం కుదరకపోయినా ఈ పది ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే చాలు.. మహాభారత సారాంశం మీకు అర్థమవుతుంది.
1. కుటుంబ సభ్యుల గొంతెమ్మ కోర్కెలు తీర్చుకుంటూ వెళితో రానున్న రోజుల్లో వాళ్లు అదుపుతప్పి పూర్తిగా మీ అధీనం నుంచి దూరమవుతాయి. ఇందుకు ఊదాహరణ - కౌరవులు. పిల్లలపై ప్రేమతో వారు చేస్తున్న తప్పులను ప్రశ్నించకుండా వారు ఏం కోరితే అది సాధించుకునేందుకు ధృతరాష్ట్రుడు ప్రోత్సహించడం వల్లే చివరకు పతనం అయ్యారు. 2. ఎంత బలవంతుడివి అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు..నేటికాలంలో నెట్ వర్క్ ఉన్నా, ఇంకెన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నా.. నువ్వు నడిచే మార్గం అధర్మం అయినప్పుడు ఈరోజు గెలిచినా రానున్న రోజుల్లో నాశనం కాక తప్పదు. ఇందుకు ఉదాహరణ కర్ణుడు. సకల విద్యలు నేర్చుకున్న కర్ణుడు అధర్మంవైపు నిలిచిన కారణంగానే పతనం అయ్యాడు 3. పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు కానీ వారి యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హులకి కూడా జ్ఞానం అందిస్తే వినాశనం తప్పదు. ఇందుకు ఊదాహరణ అశ్వత్థామ. పాండవులు, కౌరవులకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. తనయుడి ఆలోచనాతీరు సరిగా లేదని తెలిసినా విద్య నేర్పించాడు ద్రోణుడు. అందుకు ఫలితమే మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన నిలిచి కృష్ణుడి చేతిలో అశ్వత్థామశాపగ్రస్తుడయ్యాడు
రామాయణం - మహాభారతం రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు
4. కుటుంబంలో వారు తప్పులు చేస్తున్నా, అవసరం లేకపోయినా మీకెందుకు మేమున్నాం అనే భరోసా ఇస్తే దానివల్ల ఓ దశ దాటిన తర్వాత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యంగా బతకాల్సి వస్తుంది. ఇందుకు ఉదాహరణ భీష్ముడు. రాజ్యాధికారం చేపట్టను అని చెప్పడం వల్లనే కౌరవులు బాధ్యత తీసుకోవడం..తప్పులు జరుగుతున్నా ప్రశ్నించలేక జీవితాంతం చేతులు ముడుచుకుని నిర్వీర్యంగా బతకాల్సి వచ్చింది. ఆ పాప ప్రక్షాళన కోసమే అంపశయ్యపై తనకి తానుగా తీసుకున్న శిక్ష 5. ఆస్తులున్నా, శక్తి ఉన్నా, అధికారం ఉన్నా, తమను బలపరిచే సమస్తం ఉన్నా కానీ.. అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్లకు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండేవారికీ వినాశనం తప్పదు. ఇందుకు ఊదాహరణ దుర్యోధనుడు. కౌరవుల్లో పెద్దన్న అయిన దుర్యోధనుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
6. స్వార్థపరుడికి , గర్విష్టికి, జ్ఞానం ఉన్నా కేవలం తనవారికోసమే వినియోగించేవాడికి బాధ్యతలు అప్పగిస్తే వినాశనం తప్పదు. అది కుటుంబంలో అయినా...మహాభారతంలో ఇందుకు ఊహాహరణ ధృతరాష్ట్రుడు 7.ప్రతి ఒక్కరికీ మంచి శత్రువు కన్నా చెడు మిత్రుడు అత్యంత ప్రమాదకరం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారతంలో శకుని పాత్ర ఇందుకు ఉదాహరణ. కౌరవులతో ఉంటూనే..వారి మంచి కోసం అని చెబుతూనే జూదం పేరుతో పాండవులను అడవులకు పంపించి.. మహాభారత యుద్ధానికి, కౌరవుల పతనానికి కారణం అయ్యాడు శకుని 8. శక్తి యుక్తులకు , తెలివితేటలకు ధర్మం తోడుగా నిలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని విజయం తప్పకుండా వరిస్తుంది. ఇందుకు ఉదాహరణ అర్జునుడు. పాండవులు ఎంత బలవంతులు అయినా కృష్ణుడి ధర్మవ్యూహమే వారిని విజేతలుగా నిలిపింది.
9. నైతిక విలువలు పాటిస్తూ నీ మార్గంలో నువ్వు సక్రమంగా అడుగులు వేస్తే ధర్మం నీకు తోడుగా నిలుస్తుంది, ఏ శక్తీ నీకు నీవాళ్లకు హాని చేయదు. మహాభారతంలో ఇందుకు ఉదాహరణ ధర్మరాజు 10. అన్నీ తెలిసినా, అందరకీ బంధువైనా కానీ...ధర్మం వైపు నిలబడాల్సిందే. అదే భగవంతుడి కర్తవ్య ధర్మం. మహాభారతంలో ఇందుకు ఉదాహరణశ్రీ కృష్ణుడు
