Mahabharata PG: 2026 విజయ దశమి సందర్భంగా సెంట్రస్ సంస్కృత్ యూనివర్శిటీ ,ఇండియా అకాడమీ సంయుక్తంగా MA మహాభారత్ స్టడీస్ అనే రెండేళ్ల  PG కోర్స్ ప్రకటించారు.  మహాభారతం అంటే కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు.. తాత్విక, నైతిక, సామాజిక, రాజనీతి, సాంస్కృతిక , నాగరికతా అంశాలతో కూడిన సమగ్ర విద్యా విభాగంగా అధ్యయనం చేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెడుతున్నారు.

Continues below advertisement

భారతదేశంలో మహాభారత అధ్యయనానికి ప్రత్యేకంగా రూపొందించిన మొదటి ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ కోర్స్ ఇది.

Mahabharat: మహాభారతం - స్నేహం 3 రకాలు, ఇందులో మీ ఫ్రెండ్స్ ఏ టైప్!

రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ కోర్సులో ...

Continues below advertisement

Text 

ఇతిహాసం, కావ్యంగా మహాభారతం, సంస్కృత మూల పాఠాలు, సాహిత్య నిర్మాణం, సంభాషణలు, వ్యాఖ్యాన సంప్రదాయాలు. ఉద్యోగ పర్వంపై ప్రత్యేకదృష్టి, అనువాదాలు , వ్యాఖ్యానాలు

Research

ప్రశ్నలు రూపొందించడం, విమమర్శనాత్మక విశ్లేషణ పరిశోథన చేయడం  Immersion పండితులను అడిగి తెలుసుకోవడం, సాంస్కృతి సంస్థలు.. కురుక్షేత్రం వంటి స్థలాల సందర్శన, శ్రవణం మననం లాంటి సంప్రదాయ పద్ధతులపై అధ్యయనం ఏం ఉపయోగం?

ఈ వినూత్న కోర్సు ద్వారా భారతదేశపు ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సమాజ అవసరాలకు , వివిధ వృత్తిపరమైన రంగాలకు ఎలా అన్వయించవచ్చో నేర్పించనున్నారు. 

నాలుగు డొమైన్లు Text - సాహిత్యం

Thought - ధర్మం, పురుషార్థాలు, భగద్గీత, మోక్షధర్మం, ఆత్మ, నైతికత

Society - రాజధర్మం, పాలన, దౌత్యం, ఆర్థికం, పర్యావరణం

Civilisation - భౌగోళికం, ప్రాంతీయ సంప్రదాయాలు, సాంస్కృతిక జ్ఞాపకం

Mahabharat: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

అర్హత ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి?

నాలుగు సంవత్సరాల UG లేదా 3 సంవత్సరాల UG, 2 సంవత్సరాల PG ( ఏ విభాగంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు) మహాభారతంపై ప్రాథమిక అవగాహన, హిందీ/ఇంగ్లీష్/సంస్కతంలో పట్టు ఉండాలని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయ్ పూర్తి అర్హత, దరఖాస్తు తేదీలు, ఫీజు, సీట్ల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు  డిసెంబర్ 2026 లేదా తదుపరి అకడమిక్ ఇయర్లో ఈ కోర్స్ ప్రారంభం కావొచ్చని కొన్ని వార్తల్లో స్పష్టం చేశారు. అయితే అధికారిక అప్డేట్ కోసం  Central Sanskrit University వెబ్‌సైట్ (sanskrit.nic.in) ఫాలో అవడం మంచిది

90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life

మహాభారతంపై ఇదివరకే ఉన్న కోర్సులు ఇవి IGNOU లో భగవద్గీత స్టడీస్ పై MA కోర్స్ ఉంది నలంద, BHU లాంటి యూనివర్శిటీల్లో ఉన్న కోర్సులలో మహాభారతం భాగం ఆక్స్‌ఫర్డ్ సెంటర్ హిందూ స్డడీస్ వంటి చోట్ల షార్ట్ ఆన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి

సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రదాన సంస్థగా , ఇండికా విద్యా సహకారిగా ఉండటంతో, ఈ చొరవ భారతీయ జ్ఞాన వ్యవస్థలలో ఉన్నత అధ్యయనం  పరిశోధన కోసం సంస్థాగత మార్గాలను నిర్మించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును కూడా సూచిస్తుంది. ప్రవేశాలు, అర్హత,అవసరమైన విశ్వవిద్యాలయ ఆమోదాలు లభించిన తర్వాత, ప్రారంభ తేదీలు దరఖాస్తు విధానాలను ప్రకటించే అవకాశం ఉందని INDICA తన X హ్యాండిల్ లో పేర్కొంది. 

Mahabharat and Ramayan: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!