కొబ్బరి మంచి పౌష్టికాహారం. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరిలో అన్ని భాగాలు ఉపయోగపడేవిగానే ఉంటాయి. కొబ్బరి కేవలం ఆరోగ్యవంతమైన ఆహారం మాత్రమే కాదు శాస్త్రంలో కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పూజలోనూ కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది హిందూ సంస్కృతిలో విడదీయలేని అంశం. కొబ్బరికాయతో చేసే ఎన్నో పరిహారాలను శాస్త్రాల్లో మన పెద్దలు పొందుపరిచారు. వాటిని అనుసరించడం వల్ల అదృష్టం మార్చుకోవచ్చు.
ఎండు కొబ్బరికి ఆర్థిక స్థితిని మెరుగు పరిచే శక్తి ఉందని శాస్త్రం చెబుతోంది. కొబ్బరి ఉపయోగించి చేసే కొన్ని పరిహారాల గురించి పండితులు వివరిస్తున్నారు. అవేమిటో తెలుసుందాం.
ఆర్థిక స్థితి కోసం
వైశాఖ మాసంలో ఇంటి ఆవరణలో దక్షిణం లేదా పడమర దిక్కున కొబ్బరి చెట్టు నాటాలి. దీని వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుంది.
దిష్టికి పరిహారం
చిన్న పిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతుంటుంది. దిష్టి తగిలిన పిల్లలకు మంగళ వారం రోజున తలనుంచి కాలి రకు 11 సార్లు కొబ్బరికాయను తిప్పెయ్యాలి. తర్వాత కొబ్బరి కాయను నిర్జన ప్రదేశంలో పడేయ్యాలి. లేదా ప్రవహించే నీటిలో వదలాలి.
వ్యాపారాభివృద్ధికి
గురువారం నాడు కొబ్బరికాయను గుడ్డలో కట్టి దాన్ని ఇసుకలో ఉంచాలి. తర్వాత విష్ణువు ఆలయంలో ఆ కొబ్బరికాయను సమర్పించాలి. కొబ్బరికాయ సమర్పించిన తర్వాత శ్రీహరికి మీ సమస్యను విన్నవించుకోవాలి. ఈ పరిహారం చెయ్యడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి సజావుగా సాగుతుంది.
శుక్ర వారం రోజున లక్ష్మీ పూజ చేసుకుని కాయను కొట్టకుండా లక్ష్మీ దేవికి పూర్తి కొబ్బరి కాయను అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత దీనిని ఎర్రని వస్త్రంలో చుట్టి ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఎంత ధనం ఇంట్లోకి వస్తున్నా నీళ్లలా ఖర్చయి పోతోంటే, పొదుపు చెయ్యడం సాధ్యపడడం లేదని అనిపిస్తే లేదా శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నట్టయితే శనివారం రోజున 7 కొబ్బరికాయలను నీటితో పాటు అలాగే సమర్పించి ఈ కాయలను పారే నీటిలో లేదా నదిలో వదిలెయ్యాలి. ఇలా చేస్తే శని ప్రభావం తగ్గి డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
రాహుకేతు దోష నివారణకు
శనివారం రోజున కొబ్బరి కాయను రెండుగా పగులగొట్టాలి. ఆ రెండు కొబ్బరికాయ ముక్కల్లో నిండా చక్కెర నింపాలి. తర్వాత వాటిని నిర్జన ప్రదేశంలో నేలలో పాతి పెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల రాహు – కేతు, శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
Also read : చీపురు విషయంలో ఈ నియమాలు పాటించకపోతే దరిద్రం తప్పదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.