Lord Ganesh Image On The Currency Note of Indonesia : జై బోలో గణేష్ మహరాజ్‌కి అని నినాదం వినిపిస్తే.. ఆ గొంతల్లో అన్ని కులాలు, మతాలు ఉంటాయి. గణేష్ నిమజ్జనం రోజున పాతబస్తీలో ముస్లింలు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని గల్లీల్లో అయితే ముస్లింలు మండపాలు కూడా పెడడారు. అందుకే వినాయకుడు మతాలకు అతీతం అనుకోవాలి. ఇది మన దేశంలోనే కాదు. ఇతర దేశాల్లనూ వర్తిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వినాయకునికిభక్తులు
వినాయకుడు.. మన సొంత మని అనుకుంటాం. కానీ ఆయన గణాధిపత్రి. అన్నిచోట్లా ఉంటాడు. అలాగే ఇండోనేషియాలోనూ ఉన్నాడు. ఇండోనేషియలో గణేశుడ్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో చూసుకుంటారంటే.. ఆ దేశ కరెన్సీపై గణేశుడ్ని ముద్రించారు కూడా. నిజానికి ఇండోనేషియా ముస్లిం కంట్రీ. ఎనభై శాతానికిపైగా ముస్లింలు ఉంటారు. అయినా అక్కడ ప్రభుత్వ ఎలాంటి ఇబ్బంది లేకుండా గణేశుడి బొమ్మతో కరెన్సీ నోట్లను జారీ చేసింది.
గణేషుడు పుట్టింది ఆ గ్రామంలోనే ! అక్కడకు ఎలా వెళ్లాలో తెలుసా ?
1998లో 20 వేల నోటుపై గణేశుడ్ని ముద్రించిన ఇండోనేషియా ప్రభుత్వం
ఇండోనేషియా 1998లో 20 వేల ఇండొనేషియన్ రూపాయల విలువైన కరెన్సీ నోటును జారీ చేసింది. ఈ నోటుపై ఇండోనేషియా జాతిపితతో పాటు వినాయకుడి బొమ్మ ఉంది. ఈ నోటు పదేళ్ల పాటు చెల్లుబాటు అయింది. సెక్యూరిటీ ఫీచర్స్ ను అప్ గ్రే్డ్ చేయడానికన్న కారణంతో పదేళ్ల తర్వాత అంటే 2008లో ఈ నోటును ఇండోనేషియా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజల వద్ద ఉన్నవన్నీ వెనక్కి తీసుకుంది. అప్పట్నుంచి ఈ నోటు చెలామణిలో లేదు.
పదేళ్ల తర్వాత 2008లో ఉపసంహరణ
ఆ తర్వాత ఇండోనేషియా.. కరెన్సీ నోట్లపై దేవుళ్లు బొమ్మలను ముద్రించడం మానుకుంది. సెక్యూరిటీ ఫీచర్స్ అప్ గ్రేడ్ చేసిన కారణంగాపెట్టుకున్న రూల్స్ ప్రకారం.. జాతి పిత ఫోటోను ముద్రిస్తోంది. ఈ ప్రకారం చూస్తే ఇప్పుడు గణేశుడు ఉన్న కరెన్సీ నోట్లు ఇండోనేషియాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా చెల్లుబాటులో లేవు. కాన ఇండోనేషియాలో మత్రం పదేళ్ల పాటు అమల్లో ఉన్నాయి.
ఊరందరూ ఒక్కటే - ఊరికి ఒక్కటే గణేష్ మండపం ! ఈ ఐక్యత ఎక్కడో కాదు
సర్వ మతాలకు ఇష్టమైన గణాధిపతి
వినాయకుడు అందరికీ దేవుడే. ఏ కులమైనా.. మతమైనా అందర్నీ సమానంగా చూస్తాడు. ఆయన ఒక్క మనదేశంలోనే దేవుడు కాదు.. హిందూ దేశాలతోపాటు... హిందువులు ఉన్నప్రతి దేశంలోనూ ఆయన పూజలందుకుంటున్నాడు. ఆయన బొమ్మ కరెన్సీపై వేసి.. ఇండోనేషియా ప్రత్యేకమైన సేవ చేసిందని అనుకోవచ్చు.