హిందూ సంప్రదాయాల్లో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలిగించడం అంటే చీకటిని పారద్రోలడం. చీకటి అజ్ఞానానికి ప్రతీక. అజ్ఞానాంధకారంలో నుంచి జ్ఞానపు వెలుగులను ప్రసరింపజేయడానికి గుర్తుగా దీపాన్ని వెలిగిస్తారు.


ఏకార్యక్రమాన్నైనా సరే జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తారు. అది ఆధ్యాత్మిక కార్యక్రమం కాకపోయినా సరే. జ్యోతిప్రజ్వలన అనేది జ్ఞానప్రసారానికి నాందిగా భావిస్తారు కనుక ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.


దీపాలు వెలిగేందుకు రకరకాల ఇంధనాలను ఉపయోగిస్తారు. అన్నింటిలోకి నెయ్యితో వెలిగించే దీపం చాలి ప్రాశస్త్యమైందిగా భావిస్తారు. దీపం తాను కాలిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది. దీపం ద్వారా మానవతకు ఒక సందేశం కూడా అందుతుంది. దీపపు కాంతి నుంచి వెలువడే కాంతి పుట్టించే వేడి పరిసరాల్లో ఒక సమతుల్యతను తెస్తుంది. ఈ హర్మొని మనసుకు, శరీరానికి కూడా ఒక తాజాతనపు భావన కలిగిస్తుంది.


అగ్ని పూరణం ప్రకారం నేతితో వెలిగించిన దీపం అన్ని దీపాల్లోకి పవిత్రమైందిగా చెప్పవచ్చు. నేతి దీపం వెలిగిస్తే కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.


నేతి దీపాలు వాటి చుట్టూ ఆవరించి ఉండే పరిసరాల్లో సాత్విక ప్రకంపనలు వ్యాపింప చేస్తాయి. అవి వెలగడం ఆగిపోయిన తర్వాత కూడా ఈ సాత్వికత ఎన్నో గంటల పాటు ఆ పరిసరాల్లో ఉంటుంది. అందుకే నేతి దీపం వెలుగుతున్న ప్రదేశంలో ప్రశాంతంగా ఉన్న భావన కలుగుతుంది.


దీపపు వెలుగు ఇంట్లో కీటక నాశనిగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులను కూడా నశింపజేస్తుంది. ఇంట్లో కంటికి కనిపించని, బ్యాక్టీరియా, వైరస్ లను పారద్రోలుతుంది.


సంధ్యవేళ దీపారాధన చెయ్యడం వల్ల ఇంటి వాతావరణంలోనూ, ఇంట్లోని వ్యక్తుల్లోనూ ఒక రకమైన హీలింగ్ పరిస్థితులు నెలకొంటాయి.


రకరకాల దీపాలు అలంకరించి జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగను చెడు మీద మంచికి లభించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాము. నిత్యం ఇంట్లో దీపం వెలుగుతుండడం కూడా ఎలాంటి చెడు దరిచేరకుండా కాపాడుతుంది.


దైవాన్ని ప్రసన్నం చేసుకునే అనేక మార్గాలలో నేతి దీపం వెలిగించడం అనేది కూడా ఒకటి గా చెప్పవచ్చు. ఈ దీపం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. నేతి దీపం వెలుగుతున్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. నేతి దీపపు కాంతిలో దేవతలు కొలువుంటారని శాస్త్రం చెబుతోంది. నేతి దీపం వెలిగించి కోరే కోరికలు చాలా త్వరగా తీరుతాయట. నేతి దీపపు వెలుగు పరిసరాలను మరింత ఉత్సవ పూరితం చేస్తాయి. మనసుకు ఆహ్లాదంగా ఉండి ప్రశాంతమైన భావన కలుగుతుంది. దుష్ట శక్తులను ఈ దీపపు కాంతి పారద్రోలుతుందట. అంతేకాదు కొంత సమయం పాటు ఈ దీపం సమక్షంలో సమయం గడిపే వారికి కన్ఫ్యూజన్స్ తీరిపోయి ఒక క్లారిటి వస్తుంది.


నేతి దీపపు కాంతి మాత్రమే కాదు దాని నుంచి వెలువడే సువాసన కూడా పరిసరాలలోని దుర్వాసనను పారద్రోలి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.


నేతి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సకారాత్మక శక్తులకు ఆహ్వానం పలుకుతూ, దుష్టశక్తులను దూరంగా తరిమేసే ఒక అత్యుత్తమ చర్యగా చెప్పుకోవచ్చు.


Also Read : Bad Habits: ఈ దురలవాట్లు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి