Krishna Janmashtami 2025: నేడు కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున కృష్ణ భగవానుని బాల స్వరూపాన్ని పూజిస్తారు. బాల గోపాలుని పూజలో మంత్రాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి రోజున రాశి ప్రకారం మంత్రాలను జపించడం వల్ల కృష్ణ భగవానుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది,  కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరి మీ రాశి ప్రకారం ఏం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి

 ఈ రాశి వారు కృష్ణ జన్మాష్టమి రోజున ఓం కమలనాథాయ నమః మంత్రాన్ని జపించాలి. దీనివల్ల వారిపై శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారు జన్మాష్టమి రోజున కృష్ణ అష్టకం పారాయణం చేయాలి. కృష్ణ భగవానుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు.

మిథున రాశి 

ఈ రాశివారు జన్మాష్టమి రోజున 'ఓం గోవిందాయ నమః' మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా కృష్ణుడికి తులసిని సమర్పించండి, దీనివల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారు జన్మాష్టమి రోజు రాధాష్టకం పారాయణం చేయాలి. దీనివల్ల కన్నయ్య కృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.

సింహ రాశి

ఈ రాశివారు వారు శ్రీ కృష్ణాష్టమి రోజు 'ఓం కోటి-సూర్య-సమప్రభాయ నమః' మంత్రాన్ని జపించాలి. దీనిని జపించడం ద్వారా దేవకీనందనుడు త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు ఓం దేవకీ నందనాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల మీకు విశేష లాభం కలుగుతుంది.

తులా రాశి 

ఈ రాశివారు జన్మాష్టమి రోజున 'ఓం లీలా-ధరాయ నమః' మంత్రాన్ని జపించాలి. దీనివల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని వరాహ రూపాన్ని స్మరించుకోవాలి. దీని కోసం మంత్రం ఓం వరాహ నమః.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని 'ఓం జగద్గురువే నమః' మంత్రాన్ని జపించాలి. దీనివల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

మకర రాశి

మకర రాశి వారు కృష్ణ జన్మాష్టమి రోజున 'ఓం పూతనా-జీవిత హరాయ నమః' మంత్రాన్ని జపించాలి. దీనివల్ల పనుల్లో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

కుంభ రాశి

ఈ రాశి వారు జన్మాష్టమి రోజున 'ఓం దయానిధాయ నమః' మంత్రాన్ని జపించాలి. దీనివల్ల దాంపత్య జీవితంలో ఆనందం వస్తుంది.

మీన రాశి

ఈ రాశివారు కృష్ణాష్టమి రోజున అల్లరి రూపాన్ని స్మరించుకోవాలి. 'ఓం యశోదా - వత్సలాయ నమః' మంత్రాన్ని జపించడం మీకు ఫలదాయకంగా ఉంటుంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

అల్లరి కృష్ణయ్య 5 అద్భుత ఆలయాలు! ఈ క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు చూసి తీరాల్సిందే... పూర్తివివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు! లొకేషన్స్ & టైమింగ్స్!..పూర్తివివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి