Shri Krishna sons and daughters Story: శ్రీకృష్ణుడిని తలుచుకున్నప్పుడల్లా.. అల్లరి కృష్ణుడిగా, వెన్న దొంగగా, మహాభారత కురుక్షేత్రంలో అర్జునుడి దివ్య సారథిగా, భగవద్గీత జ్ఞానాన్ని అందించే జ్ఞానిగా లేదా రాధ ప్రియతముడిగా గుర్తుకువస్తాడు. అయితే.. కృష్ణుడు యోధుడు, తత్వవేత్త రాజకీయవేత్త మాత్రమే కాదు, తండ్రి కూడా. పురాణాల ప్రకారం కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు ... 1,80,000 మంది కుమారులు ఉన్నారని చెబుతారు. హిందూ గ్రంథాల్లో ప్రధానంగా కృష్ణుడికి 99 మంది కుమారుల గురించి ఉంది. శ్రీ కృష్ణుడికి కుమార్తెలు కూడా ఉన్నారని తెలుసా? కృష్ణుడు-రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు
కృష్ణుడి కుమారులలో రుక్మిణికి జన్మించిన ప్రద్యుమ్నుడు మొదటివాడు. ప్రేమ దేవుడు అని కూడా పిలువబడే కామదేవుని అంశగా చెబుతారు. యోధుడిగా, యాదవ వంశానికి చెందిన ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు ప్రద్యుమ్నుడు. ద్వారకను శత్రువుల దాడుల నుంచి రక్షించడంలో తన పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రద్యుమ్నుడు జననం , పెరుగుదల మానవ రూపంలో కృష్ణుడి దివ్య శక్తికి చిహ్నం.
కృష్ణుడు, జాంబవతి కుమారుడు సాంబ
కృష్ణుడి భార్య జాంబవతికి రెండవ కుమారుడు సాంబ. సాంబ అహంకారి. ఆ అహంకారంతోనే రుషులను ఎగతాళి చేసి యాదవవంశం పతనం అయ్యే శాపం పొందాడు. దివ్యమైన వ్యక్తుల పిల్లలు కూడా విధి, కర్మఫలం నుంచి తప్పించుకోలేరని సాంబ జీవితం నిరూపిస్తుంది (సాంబ శాపం, యాదవ వంశం, ముసలం పుట్టుక గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రుక్మిణి-కృష్ణుడి కుమారుడు చారుదేశన
రుక్మిణికి జన్మించిన మరొక కుమారుడు చారుదేశన. శ్రీకృష్ణుడి యుద్ధాలలో సన్నిహిత సహచరులలో ఒకరిగా ఉండేవాడు. ధైర్యం ,నిర్భయత్వానికి ప్రసిద్ధి చెందిన చారుదేశన సాంబకు విరుద్ధంగా మంచి క్రమశిక్షణతో ఉండేవాడు
శ్రీకృష్ణుడు కుమారుడు భాను
శ్రీకృష్ణుడు రుక్మిణికి భాను అనే మరో కుమారుడు జన్మించాడు. పేరుకి తగ్గట్టుగా ప్రకాశవంతుడు. తల్లి వంశకీర్తిని కాపాడాడంటూ భాను గురించి పురాణాల్లో పరిమిత సమాచారం ఉంది. కృష్ణుడికి భాను అత్యంత ప్రసిద్ధ కుమారులలో ఒకడు అని విష్ణుపురాణంలో ఉంది ద్వారక రక్షకుడు కుమారుడు గద
రుక్మిణి కుమారులలో మరొకడు గద. ద్వారక రక్షకుడిగా ఉండేవాడు గద . శ్రీకృష్ణుడి కుమారులతో పాటు మనవళ్లు కూడా గొప్ప వీరులు, ధైర్యవంతులు. ద్వారక నీట మునిగిన తర్వాత ఆ వంశస్థులు యాదవ వంశాన్ని ముందుకి తీసుకెళ్లారు
విష్ణు పురాణం ప్రకారం..
రుక్మిణికి 10 మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ప్రద్యుమ్న, చారుదేశ్న, సుదేశ్న, చారుదేహ, సుచారు, చారుగుప్త, భద్రచారు, చారుచంద్ర, విచారు, చారు
జాంబవతి 10 మంది కుమారులు
పెద్ద కుమారుడు సాంబ. ఇతర కుమారులలో సుమిత్ర, పురుజిత్ , ఇతరులు ఉన్నారు. వారి పేర్లు హరివంశంలో చూడవచ్చు. జాంబవతి కుమారులు తమ ధైర్యం సాహసానికి ప్రసిద్ధి చెందారు, కాని సాంబకు వచ్చిన శాపం కారణంగానే యాదవ వంశం అంతమైంది.
సత్యభామ 10 మంది కుమారులు
కృష్ణుడికి ప్రియమైన రాణి అయిన సత్యభామకు 10 మంది కుమారులు ఉన్నారు. విష్ణు పురాణంలో వారి పేర్లు శ్రీకృష్ణుడి విస్తారమైన వంశాన్ని సూచిస్తాయి.
మత గ్రంథాల్లో ప్రత్యేకంగా శ్రీకృష్ణుడి కుమారులపైనే దృష్టి సారించారు కాని కుమార్తెల గురించి పెద్దగా ప్రస్తావన లేదు. వారంతా ఆర్యవర్త రాజ కుటుంబాలకు చెందినవారిని వివాహం చేసుకున్నారు. కుమార్తెల వివాహాలు రాజకీయ కోణం నుంచి ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. ఇవి పొత్తులను బలోపేతం చేశాయి , యాదవ వంశం ప్రభావాన్ని పెంచాయి. అయితే కుమార్తెల పేర్లు కూడా ఎక్కడా లేవు. కృష్ణుడికి 99 మంది పిల్లలు ఉండటం యాదృచ్ఛికం కాదు, చాలా సంప్రదాయాలు నమ్మకాలలో ఇది పరిపూర్ణతకు ముందు అసంపూర్ణతకు చిహ్నం. శ్రీకృష్ణుడి అసంఖ్యాక సంతానం మానవ సమాజంలో దివ్య విస్తరణ ఆలోచనను చూపుతుంది..ఇది అనేక వంశాలలో ధర్మాన్ని వ్యాప్తి చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.