Kouravas full names : మహాభారతంలో కురు పాండవుల గురించి తెలియని వారుండరు. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అనే నానుడి తెలుగునాట చాలా ప్రసిద్ది. అలాంటి భారతంలో దాయాదుల పోరు రసవత్తరంగా జరిగి భారతం చదవాలన్నా.. వినాలన్నా మరింత ఆసక్తిని రేకేత్తేలా చేసింది. అయితే పాండువులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 మందే కాబట్టి వారి పేర్లను ఎవరైనా చిటికెలో చెప్పేస్తారు.


కానీ కౌరవులు వంద మంది. ఆ వంద మంది పేర్లు చిటికెలో చెప్పేయడం కాదు కదా? కనీసం వారిలో ఓ పది మంది పేర్లు కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఒకవేళ చాలా కొంత మందికే తెలిసినా అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. అయితే వంద మంది కౌరవులున్నా.. అయిదు మంది పాండవుల చేతిలో భారత యుద్దంలో ఓడిపోయారు. అందుకేనేమో ఓడిపోయిన వారిని చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకోదు అన్నట్లు కౌరవుల పేర్లు ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేదేమో..?


ధృతరాష్ట్రుడు, గాంధారికి పుట్టిన వారినే కౌరవులు అంటారు. వంద మంది కౌరవుల పుట్టుక కూడా అందరిలా జరగలేదు. కుంతికి కుమారుడు పుట్టాడని తెలిసిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని గట్టిగా కొట్టడంతో నెలల నిండక ముందే పిండం ముక్కలై బయటకు రావడంతో.. వ్యాస మహర్షి ఆ ముక్కలను నూటొక్క భాగాలుగా విభజించి పాల కుండలలో భద్రపరచి రెండు సంవత్సరాల తర్వాత బయటకు తీయగా నూరు మంది కౌరవులు, దుశ్శల అనే అమ్మాయి పుడతారు. అలా పుట్టిన వంద మంది కౌరవుల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం.   



  1. దుర్యోధనుడు

  2. దుశ్సాసనుడు

  3. దుస్సహుడు

  4. దుశ్శలుడు

  5. జలసంధుడు

  6. సముడు

  7. సహుడు

  8. విందుడు

  9. అనువిందుడు

  10. దుర్ధర్షుడు

  11. సుబాహుడు

  12. దుష్పప్రదర్శనుడు

  13. దుర్మర్షణుడు

  14. దుర్మఖుడు

  15. దుష్కర్ణుడు

  16. కర్ణుడు

  17. వివింశతుడు

  18. వికర్ణుడు

  19. శలుడు

  20. సత్వుడు

  21. సులోచనుడు

  22. చిత్రుడు

  23. ఉపచిత్రుడు

  24. చిత్రాక్షుడు

  25. చారుచిత్రుడు

  26. శరాసనుడు

  27. ధర్మధుడు

  28. దుర్విగాహుడు

  29. వివిత్సుడు

  30. వికటాననుడు

  31. నోర్జనాభుడు

  32. సునాబుడు

  33. నందుడు

  34. ఉపనందుడు

  35. చిత్రాణుడు

  36. చిత్రవర్మ

  37. సువర్మ

  38. దుర్విమోచనుడు

  39. అయోబావుడు

  40. మహాబావుడు

  41. చిత్రాంగుడు

  42. చిత్రకుండలుడు

  43. భీమవేగుడు

  44. భీమలుడు

  45. బలాకుడు

  46. బలవర్ధనుడు

  47. నోగ్రాయుధుడు

  48. సుషేణుడు

  49. కుండధారుడు

  50. మహోదరుడు

  51. చిత్రాయుధుడు

  52. నిషింగుడు

  53. పాశుడు

  54. బృందారకుడు

  55. దృఢవర్మ

  56. దృఢక్షత్రుడు

  57. సోమకీర్తి

  58. అనూదరుడు

  59. దఢసంధుడు

  60. జరాసంధుడు

  61. సదుడు

  62. సువాగుడు

  63. ఉగ్రశవుడు

  64. ఉగ్రసేనుడు

  65. సేనాని

  66. దుష్పరాజుడు

  67. అపరాజితుడు

  68. కుండశాయి

  69. విశాలాక్షుడు

  70. దురాధరుడు

  71. దుర్జయుడు

  72. దృఢహస్థుకు

  73. సుహస్తుడు

  74. వాయువేగుడు

  75. సువర్చుడు

  76. ఆదిత్యకేతుడు

  77. బహ్వాశి

  78. నాగదత్తుడు

  79. అగ్రయాయుడు

  80. కవచుడు

  81. క్రధనుడు

  82. కుండినుడు

  83. ధనుర్ధరోగుడు

  84. భీమరథుడు

  85. వీరబాహుడు

  86. వలోలుడు

  87. రుద్రకర్ముడు

  88. దృణరధాశ్రుడు

  89. అదృష్యుడు

  90. కుండభేరి

  91. విరాని

  92. ప్రమధుడు

  93. ప్రమాధి

  94. దీర్గరోముడు

  95. దీర్గబాహువు

  96. ఉడోరుడు

  97. కనకద్వజుడు

  98. ఉపాభయుడు

  99. కుండాశి

  100. విరజనుడు.


99 మంది కౌరవులు చివరి వరకు పెద్దవాడైన దుర్యోధనుడి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాట ప్రకారం మహాభారత యుద్దంలో పాల్గొని పాండవుల చేతిలో చనిపోయారు. నూట ఒకటవ వ్యక్తిగా పుట్టి... కౌరవుల ముద్దుల సోదరి గా పేరు గాంచిన దుశ్శల మాత్రం పాండవుల పక్షాన ఉండేదని భారతంలో ఉంది. అయితే అందరూ అనుకున్నట్లు కర్ణుడు కౌరవులలో ఒకడు కానే కాదు. ఆయన కుంతిదేవికి, సూర్యుడికి పుట్టిన వాడని.. ఆయన అవసరం కోసం మాత్రమే కౌరవుల పక్షాన ఉన్నాడని భారతంలో ఉంది. 


ALSO READ: మహానుభావుల సందేశాలు, ఈ శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయండి!