కలలన్నీ కల్లలు కాకపోవచ్చు. కొన్ని సార్లు కలలు భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా సందేశానికి సూచన కావచ్చు. చాలా సార్లు కలల్లో ఏదో నిగూఢ అర్థం దాగుంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. అందులో కొన్ని శుభ సూచకాలైతే మరికొన్ని అశుభానికి ప్రతీకలు కావచ్చు. చాలా సార్లు మనకు ఈ కలల వెనకున్న అర్థం అంత త్వరగా అర్థం కాదు. కలలో పాలు కనిపిస్తే శుభ సూచకం అంటుంటారు. పాలు రకరకాలుగా కనిసిస్తే మంచిది. పాలు కనిపిస్తే ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? పాలు ఎలా కనిపిస్తే ఏలాంటి అర్థం ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.


స్వప్న శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి కలలో పాలు తాగడం లేదా అవి పడిపోవడం కనిపిస్తే శుభసూచకమని లేదా అది ఆరోగ్యానికి సూచన అని సంకేతమట. శాస్త్రాన్ని అనుసరించి పాలు లక్ష్మీ స్వరూపం. కలలో పాలు కనిపిస్తే దానికి వివిధ రకాల అర్థాలుంటాయి.


కలలో పాలు తాగితే


కలలో మీరు పాలు తాగుతున్నట్టు కల వస్తే అది చాలా శుభప్రదం. కలలో పాలు తాగడం అనేది మీ పురోబివృద్ధికి సంకేతం. సమీప భవిష్యత్తులో మీ కేరీర్ లో మంచి విజయాలు సాధించబోతున్నారనేందుకు ఈ కల ఒక సందేశంగా భావించవచ్చు.


పాలు కొంటున్నట్టు


స్వప్న శాస్త్రాన్ని అనుసరించి పాలు కొంటున్నట్టు కల వస్తే అది మంచి ఆరోగ్యానికి సంకేతం. దీర్ఘకాలికంగా ఆనారోగ్యంతో ఉన్న వారికి పాలు కొంటున్నట్టు కల వస్తే అది చాలా శుభ సంకేతం. త్వరలో వారు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పే సందేశంగా భావించవచ్చు.


కలలో పాలు విరిగితే


మీరు కాస్తున్న పాలు విరిగిపోయినట్టుగా కల వస్తే అది శుభప్రదం కాదు. కలలో పాలు విరిగిపోతే రాబోయే కష్టకాలానికి సూచన. జీవితంలో ఏదో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని అనేందుకు సంకేతం. ఆర్థిక లేదా సామాజిక లేదా ఏదైనా కెరీర్ కు సంబంధించి ఇబ్బందుల్లో పడనున్నారని అర్థం.


పాలు పితుకుతున్నట్టు


మీకు కలలో మీరు ఆవు పాలు పితుకుతున్నట్టు కల వస్తే అది చాలా శుభప్రదమైన కల. త్వరలో మీ జీవితంలోకి ఆనందం, సమృద్ధి రానున్నాయని చెప్పే సంకేతం. అంతేకాదు చాలా పెద్ద మొత్తంలో మీకు ధనం చేతికంద బోతోందని ఈ కల సందేశాన్నిస్తుంది.


కాగుతున్న పాలు


కలలో పాలు కాస్తున్నట్టు కనిపిస్తే అది కూడా శుభసూచకమే. మరుగుతున్న పాలు శుభవార్తలు వింటారని అనడానికి సూచన. త్వరలో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అనేందుకు సంకేతం. అంతేకాదు పాలలో చక్కెర కలుపుతున్నట్టు కనిపస్తే త్వరలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారని అనేందుకు ఇదొక సందేశంగా భావించాలి.


Also read: మామిడి పండు తింటున్నట్లు కల వచ్చిందా? జరిగేది ఇదే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.