Jagannath Rath Yatra 2025:  ఏటా ఆషాఢమాసంలో జరగబోయే పూరీ జగన్నాథుడి రథయాత్రకు APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది కూడా జూన్ 27న రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఆ వివరాలు ఇవే..

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) నుంచి ప్రత్యేక బస్సుల వివరాలు

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పూరీ రథయాత్రకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ఈనెల 25 రాత్రి 10 గంటలకు బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. 26న అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయాల సందర్శన ఉంటుంది. 26 సాయంత్రం ఆర్కే బీచ్ దగ్గర కాసేపు ఆపి అక్కడి నుంచి 6 గంటలకు స్టార్ట్ అవుతాయి. జూన్ 27 కోణార్క్ సూర్యదేవాలయ సందర్శన ఉంటుంది. అనంతరం పూరీ జగన్నాథుడి దర్శనం..రథయాత్రల సందడి. రాత్రి ఒంటిగంటవరకూ అక్కడే ఉంది రథయాత్ర నుంచి తిరికి విజయవాడ చేరకుకుంటారు. 

సూపర్ లగ్జరీ, హైటెక్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3,600

ఇంద్ర ఏసీ ఒక్కొక్కరికీ రూ.4,800 చెల్లించాల్సి ఉంటుంది

ఆన్లైన్ ద్వారా కానీ ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు

30మంది గ్రూ ప్ గా ఉన్నట్టయితే వారి నివాస ప్రాంతం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్టీసీ అధికారులు

ప్రయాణంలో భోజనం, ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులవే. 

తిరువూరు, జగ్గయ్యపేట నుంచి రథయాత్రకు వెళ్లేవారి సంక్య 30 మంది ఉన్నట్టైతే అక్కడి నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే...807429 8487 , 9515860465,  8247451915 , 73828931 97

రావులపాలెం APSRTC డిపో నుంచి ప్రత్యేక బస్సులు

రావులపాలెం డిపో నుంచి జూన్ 26న బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు తిరిగి 29న రావులపాలెం చేరుకుంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా  పూరీ జగన్నాథ రథోత్సవం,  అరసవల్లి సూర్యనారాయణ ఆలయం, కోణార్క్ ఆలయం, భువనేశ్వర్, సింహాచలం దర్శనం అనంతరం తిరిగి రావులపాలెం చేరుకుంటుంది. 

ఒక్కొక్కరికి టికెట్ ధర 4,600 ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ తో కలిపి)

పూర్తి వివరాలకోసం సంప్రదించాల్సిన నంబర్లు డిపో మేనేజర్ 9959225537అసిస్టెంట్ మేనేజర్ 7382911871

ఇప్పటికే రథయాత్ర సందర్భంగా రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఒడిశా అధికారులు. ఈ మేరకు ఒడిశా బస్సు యజమానుల సంఘం కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర రవాణా కమిషనర్‌ అమితాబ్‌ ఠాకూర్‌ సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రయాణికుల బస్సులతో పాటు వివిధ వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేస్తామని చెప్పారు. ప్రత్యేక బస్సులను మాలతీపట్టపూర్‌, తొలబొణియా మైదానాల్లో నిలిపి ఉంచి అక్కడి నుంచి రథయాత్ర ప్రదేశానికి తరలించేందుకు 100 ఆటోలు అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరకన్నా యాత్రికుల నుంచి ఎక్కువ వసూలు చేయరాదని బస్సులు, ఆటో వర్గాలకు సూచించారు. తొలబొణియా బస్‌ స్టాప్‌లో 10 రూపాయలకు శాఖాహార భోజనం అందుబాటులో ఉండనుంది. వాహనాల రద్దీ నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.  భువనేశ్వర్‌ – పూరీ, పూరీ – కోణార్క్‌, పిప్పిలి – పూరీ సహా కీలక మార్గాల్లో వాహనాల రవాణాకు అంతరాయం లేకుండా చూస్తున్నారు.

 Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి