Islam Rules defecation and toilet: ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం, ఇది ఏకేశ్వరత్వాన్ని విశ్వసిస్తుంది. 7వ శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ) ద్వారా అరేబియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రారంభమైంది. ఇస్లాంలో జీవనశైలికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి, వీటిని ప్రతి ముస్లిం అనుసరించడం అవసరం.
ఇస్లాం మతంలో మలవిసర్జన చేసేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అనేక రకాల నియమాలు ఉన్నాయి. ఏ విషయం కూడా ఖురాన్‌లో లేదు అని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇవన్నీ హదీసులు .. వివిధ వ్యక్తుల చరిత్ర ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించినవి
మరుగుదొడ్డికి సంబంధించి ఖురాన్‌లో వ్రాసిన ఏకైక విషయం ఏంటంటే, మీరు మరుగుదొడ్డి నుంచి బయటకు వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడం. దీని ప్రస్తావన ఖురాన్ 5:6 వచనంలో ఉంది.
ఇస్లాంలో మలవిసర్జనకు సంబంధించిన ఈ నియమాలు ఇంటర్నెట్‌లో లభించే సమాచారం నుంచి సేకరించినవి.. ఇందులో పేర్కొన్నది ఏంటంటే,
మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు లోపల మొదట ఎడమ కాలును వేయాలి.. బయటకు వచ్చేటప్పుడు కుడి కాలును ముందుగా బయట వేయాలి టాయిలెట్‌లో ఎవరైనా ఎక్కువ సమయం ఉండకూడదు, కూర్చోకూడదు, మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు లేదా ఎలాంటి పుస్తకం చదవకూడదు.
మూత్ర విసర్జన లేదా మలవిసర్జన చేసేటప్పుడు ఎప్పుడూ మక్కా వైపు ముఖం లేదా వీపుతో కూర్చోకుండా ఉండాలి.
ఏ వ్యక్తి అయినా తన పాయువుకు అంటుకున్న మలాన్ని వేలితో శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి.
మలవిసర్జన చేసిన తర్వాత జననాంగాలను శుభ్రపరిచేటప్పుడు, పురుషులు వెనుక నుంచి ముందుకు కడగాలి, అయితే మహిళలు ముందు నుంచి వెనుకకు కడగాలి
ఒక వ్యక్తి వీలైనంత వరకు మలవిసర్జనను తగ్గించడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే శరీరంలోని సహజ విధులను పాపపూరితంగా .. అపవిత్రంగా భావిస్తారు.
మరుగుదొడ్డిని ఉపయోగిస్తున్నప్పుడు తినకూడదు.
ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం, స్వర్గంలో మలవిసర్జన చేయవలసిన అవసరం లేదు. బదులుగా చెమట పడుతుంది .. ఆ చెమట వాసన కస్తూరిలా ఉంటుంది.
హబీబ్ బిన్ సలేహ్ మాట్లాడుతూ, అల్లాహ్ దూత మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు, అతను బూట్లు ధరించి, తలపై వస్త్రం కప్పుకునేవాడు.
మీ ఇంట్లో మరుగుదొడ్డి మక్కా వైపు ఉంటే, కొంత డబ్బు ఖర్చు చేసి, దానిని వేరే దిశలో నిర్మించండి. ఎందుకంటే ప్రతిసారీ మరుగుదొడ్డిని ఉపయోగించడం వల్ల మీ పాపాలు పెరుగుతాయి.
ఆయిషా (అల్లాహ్ భార్య) ఇలా అన్నారు, అల్లాహ్ దూత నిలబడి మూత్ర విసర్జన చేసేవాడని ఎవరైనా చెబితే, వారిని నమ్మకుండి. వారు కూర్చుని మూత్ర విసర్జన చేసేవారు. మరణానంతరం సమాధిలో శిక్షకు ఒక కారణం నిలబడి మూత్ర విసర్జన చేయడం కూడా ఉంది.
మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నప్పుడు, ఓ అల్లాహ్.. మగ , ఆడ ఇద్దరు దెయ్యాల నుంచి రక్షణ కోరుతున్నాను అని చెప్పాలి.
ముస్లిం మహిళలు తమను తాము శుభ్రపరుచుకునేటప్పుడు ఎడమ చేతి అరచేతి దిగువ భాగాన్ని ఉపయోగించాలి , కాళ్ళను దగ్గరగా ఉంచాలి ముస్లిం నమ్మకాల ప్రకారం..ఎవరూ తమ జననాంగాలను ఎలాంటి అవసరం లేకుండా చూసుకోకూడదు..అలా చేయడం వల్ల మెదడు పనితీరు బలహీనపడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.