Prakash Raj Reaction On Sivaji Comments Issue Supports Anasuya Bharadwaj : హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై నటుడు శివాజీ, యాంకర్ అనసూయ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన నాగబాబు శివాజీపై ఫైరయ్యారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం అనసూయకు సపోర్ట్‌గా నిలిచారు.
'వారిని మొరగనివ్వండి'
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాష్ రాజ్ అనసూయకు సపోర్ట్‌గా నిలుస్తూ తాజాగా ట్వీట్ చేశారు. 'సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వం. మీరు ఇంకా బలంగా నిలబడండి. మేము మీతో ఉన్నాం.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read : ఓటీటీలో 'OG' విలన్ కోర్ట్ రూమ్ డ్రామా 'హక్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
నాగబాబుకు అనసూయ థాంక్స్
మరోవైపు, నటుడు నాగబాబు కూడా శివాజీ కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలు మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం తప్పుకాదని... వాటిని జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఆడపిల్లలపై జరిగే వేధింపులు డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కాదని... మగవాడి పశు బలం, క్రూరత్వం అని అన్నారు. అమ్మాయిలు అలా ఉండాలి ఇలా ఉండాలి అనే మనస్తత్వాలను ఖండించాలన్నారు. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన అనసూయ... 'మా నాగబాబు గారు మాకు సపోర్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ మా వైపే. అది మాకు చాలా బలం.' అంటూ థాంక్స్ చెప్పారు.
వివాదం ముగిసేనా?
అటు, నటుడు శివాజీ తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఇప్పట్లో ఈ వివాదం ముగిసేలా కనిపించడం లేదు. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకోవాలని చెబుతూనే... 2 వాడకూడని పదాలు వాడడంతో వివాదం రేగింది. శివాజీ కామెంట్స్‌పై అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవి చేతకాని మాటలు అంటూ ఫైరయ్యారు.
ఈ కామెంట్స్‌పై శివాజీ సైతం స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. త్వరలోనే మీ రుణం తీర్చుకుంటానంటూ చెప్పగా... మీలాంటి వాళ్ల సపోర్ట్ తనకు అవసరం లేదంటూ అనసూయ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో సైలెంట్ వార్ నడుస్తోంది. మరోవైపు, నెటిజన్లు సైతం ఎక్కువగా శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు. కొందరు ఆడవాళ్లు సైతం ఆయన కామెంట్స్‌లో తప్పేముంది? కానీ ఆ పదాలు వాడడం తప్పు అంటూ వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు శివాజీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియాల్సి ఉంది.