IRCTC Tour Package: మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రదేశాలు చూసేందుకు రకరకాల ప్యాకేజీలను గత కొన్ని సంవత్సరాలుగా 'Heritage Of Madhya Pradesh'పేరుతో IRCTC టూరిజం ఆపరేట్ చేస్తోంది. అయితే, మధ్యప్రదేశ్ మహాదర్శన్ పేరుతో ఈ సంవత్సరం ఒక ప్యాకేజీని అందిస్తోంది. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక టూర్. ఈ టూర్ లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ ప్రదేశాలు చూడొచ్చు. ఇది 4 రాత్రులు విడిది చేసే ఐదు రోజుల ప్యాకేజ్.


మధ్యప్రదేశ్ మహాదర్శన్ ప్యాకేజ్


మొదటి రోజు:


హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో బయలుదేరి మధ్యాహ్నానికి ఇండోర్ చేరుకుంటారు. అక్కడి నుంచి 60 కి.మీ దూరంలో ఉజ్జయిని ఉంటుంది. హోటల్లో రాత్రి అక్కడ బస చేస్తారు. చుట్టు పక్కన ఉన్న దేవాలయాలు అదే రోజు దర్శించుకోవచ్చు. 


రెండో రోజు:


హోటల్లో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని, ఉజ్జయినిలో హరసిద్ధిమాత టెంపుల్, చింతమాన్ గణేశ్ టెంపుల్, సందిపాణి ఆశ్రమం, మంగళ్ నాథ్ టెంపుల్ సందర్సించుకోవచ్చు. సాయంత్రం దగ్గరలో ఉన్న మహాకాళేశ్వర్ టెంపుల్ దర్శించుకోవచ్చు. రాత్రి డిన్నర్ ముగించుకొని ఉజ్జయినిలోనే బస చేయాలి. 


మూడో రోజు:


ఉదయాన్నే కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. హోటల్‌లో బ్రేక్ఫాస్ట్ ముగించి, చెకౌట్ చేస్తారు. అక్కడి నుంచి మహేశ్వర్ (165 కి.మీ.దూరంలో ఉంటుంది)కి బయలుదేరుతారు. అహల్యా దేవి కోట, నర్మదా ఘాట్ దర్శిస్తారు (సొంత ఖర్చులతో ఆటో-రిక్షాల ద్వారా). తర్వాత ఓంకారేశ్వర్‌కు (70 కి.మీ.) బయలుదేరుతారు. హోటల్‌లో చెకిన్ అవుతారు. ఓంకారేశ్వర్‌లో డిన్నర్ చేసి, నైట్ బస చేస్తారు. 


నాలుగో రోజు:


హోటల్‌లో బ్రేక్ఫాస్ట్ చేసి, ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి చెక్ అవుట్ చేసి, ఇండోర్‌కు బయలుదేరుతారు (80 కి.మీ.). అక్కడ పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తారు. హోటల్‌లో చెకిన్ అయి, రాత్రి ఇండోర్‌లో డిన్నర్, నైట్ బస చేస్తారు. 


ఐదో రోజు:


హోటల్‌లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అన్నపూర్ణ మందిర్, లాల్ బాగ్ ప్యాలెస్‌ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసాక, సాయంత్రం 4 గంటలకు ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. ఈరోజుతో పర్యటన పూర్తవుతుంది. హైదరాబాద్‌కు విమానంలో తిరిగి రావాలి. 


ఈ ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?


విమాన టిక్కెట్లు (హైదరాబాద్ - ఇండోర్ - హైదరాబాద్).
2 రాత్రులు ఉజ్జయిని, 1 రాత్రి ఓంకారేశ్వర్ & 1 రాత్రి ఇండోర్ బస, 
4 రోజులు అల్పాహారం, 4 రోజులు రాత్రి భోజనం
ప్రయాణ ప్రణాళిక ప్రకారం సందర్శన కోసం AC 35 సీట్ల బస్సు,
ప్రయాణపు బీమా.
పర్యటన సమయంలో IRCTC  టూర్ ఎస్కార్ట్ సేవలు,
ఈ సేవలకు వర్తించే అన్ని పన్నులు ఈ ప్యాకేజీలో ఉంటాయి. 


ఈ ప్యాకేజీలో ఏమేం మినహాయించారు?


లంచ్, అన్ని రోజుల‌్లో ఏదైనా అదనపు ఫూడ్ సర్వీసులు.
హైదరాబాద్‌లో స్థానిక రవాణా/విమానాశ్రయం పిక్ అప్ అండ్ డ్రాప్.
విమానంలో భోజనం.
ఎంట్రీ టిక్కెట్లు, సందర్శనా స్థలాలు లేదా దేవాలయాల‌్లో దర్శన టిక్కెట్లు
డ్రైవర్లు, గైడ్‌లు మొదలైన వారికి అన్ని రకాల టిప్ లు. 
సాధారణ మెనూలో పేర్కొన్నవి కాకుండా లాండ్రీ ఖర్చులు, వైన్, మినరల్ వాటర్, ఫూడ్, డ్రింక్స్ వంటి ఏదైనా వ్యక్తిగత ఖర్చులు.
టూర్ గైడ్ సర్వీస్. 


మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి ఉంటుంది. దీన్ని చూడాలనుకునే వారు, 15 రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం, అలాగే మహాదర్శన్ ప్యాకేజ్ పూర్తి వివరాల కోసం IRCTC అఫిషియల్ వెబ్సైట్ చూడండి.