Jyotirlinga Yatra Package : పరమేశ్వరుడి భక్తులకు శుభవార్త చెప్పింది IRCTC.  ఆగష్టు 16 నుంచి 9 రోజుల పాటు పంచ జ్యోతిర్లింగ యాత్ర చేసే అవకాశం కల్పిస్తోంది . ఈ మేరకు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలుతో ప్రత్యేక యాత్రను  ప్రకటించింది  

Continues below advertisement


మొత్తం జ్యోతిర్లింగాలు 12...


వీటిలో 5 జ్యోతిర్లింగాల దర్శనంతో కల్పించేందుకు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలుతో ప్రత్యేక యాత్రను IRCTC ప్రకటించింది.


ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడివరకూ సాగుతుంది?


ఎప్పుడు ప్రారంభమవుతుంది?


ఎన్నిరోజుల యాత్ర? యాత్రకు ఎంత ఖర్చవుతుంది?


పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది కేవలం జ్యోతిర్లింగ యాత్ర మాత్రమే కాదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితంలోని ముఖ్య ప్రదేశాలు చూసే అవకాశం కూడా ఉంటుంది.


ఆగష్టు 16 న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమయ్యే పంచ జ్యోతిర్లింగ యాత్ర ఆగష్టు 24 న ముగుస్తుంది. అంటే మొత్తం 9 రోజుల యాత్ర ఇది. 


 ఐఆర్‌సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం పంచ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా ఏఏ ప్రదేశాలు దర్శించుకోవచ్చంటే...


ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగం


తాంత్రిక మంత్రాలతో పూజించే జ్యోతిర్లింగం ఇది.. ఇక్కడ ఆలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది. గర్భగుడిలో శ్రీ చక్రయంత్రం తిరగేసి కనిపిస్తుంది. ఇక్కడ మహా కాళేశ్వరుడికి నిత్యం తెల్లవారుజామున భస్మాభిషేకం చేస్తారు. కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు


ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగం


సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఇక్కడ ఓంకారేశ్వర లింగంతో పాటూ  అమలేశ్వర లింగాన్ని దర్శించుకోవచ్చు


దీక్షా భూమి స్తూపం (అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం)


నాగ్‌పుర్‌లోని స్వామినారాయణ మందిరం


మోవ్‌ వద్ద జన్మ భూమి (అంబేడ్కర్‌ జన్మస్థలం)


నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం


బ్రహ్మవిష్ణువు ప్రార్థనలతో స్వయంభువుగా వెలసిన జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వరం. ఇక్కడ కొలువైన శివలింగంలో చిన్న గుంట ఉంటుంది..అందులో త్రిమూర్తి స్వరూపంగా మూడు శివలింగాలు కనిపిస్తాయి


పుణెలో భీమశంకర్‌ జ్యోతిర్లింగం


త్రిపురాసుర సంహారం తర్వాత ఈశ్వరుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం భీమశంకరం. ఇక్కడున్న శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంది. అంటే శివుడి రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులే భీమనదిగా మారిందని స్థలపురాణం


ఔరంగాబాద్‌ వద్ద ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగం 


అజంతా ఎల్లోరా గ్రామంలో కొలువైంది ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం


తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్‌ సహా కామారెడ్డి, నిజామాబాద్, స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కే సౌకర్యం కల్పించారు.   రైలు, రోడ్డు రవాణా, వసతి సౌకర్యం, భోజనం సహా అన్నీ కలపి యాత్ర ప్యాకేజ్ ప్రకటించింది IRCTC.


‘భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు’తో పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేడ్కర్‌ యాత్రకు ... మీరు ప్రయాణించే తరగతి బట్టి  14 వేల 700 నుంచి  29 వేల  900 గా ఖరారు చేసింది. 


ఈ యాత్రకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్ నంబర్లను సంప్రదించండి
9701360701, 9281030712, 9281030711  


శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి...12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి