International Yoga Day 2025: ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు.. ద్వాదశ ఆసనాలు..అవే సూర్య నమస్కారాలు. సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి సరిపోతాయి. ఎందుకంటే.. లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. నిత్యం సూర్యారాధన చేసేవారికి ఆరోగ్యం, మనోవికాసం సిద్ధిస్తుంది. 

భగవంతుడి ప్రార్థన ప్రారంభించేది సూర్యారాధనతోనే

అగస్త్య మహర్షి సూచన మేరకు ఆదిత్య హృదయం పఠించి రావణుడితో యుద్ధంలో విజయం సాధించాడు రామచంద్రుడు

సమస్త విశ్వంలో ఉండే చీకట్లు చీల్చి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడు నవగ్రహాలు రాజు..అందుకే సూర్యారాధన చేసేవారిపై గ్రహాల ప్రతికూల ప్రభావం ఉండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలే స్వయం విష్ణుః, త్రిముర్తిస్తూ దివాకరః 

ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపుతాడుమధ్యాహ్నం కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలు తొలగించి ఉత్సాహాన్ని నింపుతాడుసాయంత్రం విష్ణు స్వరూపుడిగా కిరణాల ద్వారా ఆనందాన్నిస్తాడు

సూర్య భగవానుడు 12 రూపాల్లో దర్శనమిస్తాడు.. అవే ధాతా, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణు. నెలకో పేరుతో 12 నెలల్లో సంచరిస్తాడు ఆధిత్యుడు. ఈ 12 పేర్లు స్మరిస్తే చాలు దీర్ఘకాల వ్యాధులు నయం అవుతాయని భవిష్య పురాణంలో ఉంది.  

12 మంది సూర్యులకు గుర్తుగా 12 ఆసనాలు చెబుతారు..అవే సూర్య నమస్కారాలు.  కుడి ఎడమల వ్యత్యాసం మినహాయిస్తే 12 ఆసనాల్లో  1 నుంచి 5 , 8 నుంచి 12 ఒకేలా ఉంటాయి...అయితే ప్రతి ఆసనానికి ఓ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. 

సూర్య నమస్కారాల్లో వేసే ఆసనాల వల్ల  శ్వాస కోశ వ్యవస్థ మెరుగుపడుతుంది

మెడ , భుజాలు, వెన్నెముక దగ్గర  కండరాలు దృఢంగా మారుతాయి

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, వెన్నుముక బలోపేతం అవుతుంది

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కాలి కండరాలు బలోపేతం అవుతాయి

వెన్నుముక, చేతి మణికట్టు కండరాలు దృఢంగా మారుతాయి

గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఆపుతాయి

బరువు తగ్గుతారు, మానసిక ఒత్తిడి మాయమవుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు

దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

12 ఆసనాలు వేసేటప్పుడు ద్వాదశ ఆదిత్యులను స్మరించుకోవాలి నమస్కారాసనం (ఓం మిత్రాయ నమః) - సూర్యుడికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయాలి 

హస్త ఉత్తానాసనం (ఓం రవయే నమః) - నమస్కారం చేసిన రెండు చేతులను అలాగే పైకెత్తి, తల నడుము వెనుకకు వంచాలి 

పాదహస్తాసనం  (ఓం సూర్యాయ నమః) - శ్వాసను నెమ్మదిగా వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆన్చి తలను మోకాలుకు తగిలేలా  ఉంచాలి

ఆంజనేయాసనం (ఓం భానవే నమః) - ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతులు పైకెత్తి నడుము భాగాన్ని వెనక్కు వంచాలి  

పర్వతాసనం (ఓంఖగాయ నమః) - కాళ్ళు, చేతులు నేల మీద ఉంచి నడుము పైకి ఎత్తి శ్వాస నెమ్మదిగా వదలి తిరిగి పీల్చాలి 

 సాష్టాంగ నమస్కారం  (ఓం పూష్ణే నమః) - నేలపై పడుకుని నడుము భాగాన్ని కొద్దిగా పైకి లేపి శ్వాసను పూర్తిగా బయటకు వదలాలి సర్పాసనం (ఓం హిరణ్యగర్భాయ నమః) - శ్వాసను పీల్చి తలను వెనుక్కు వంచాలి 

పర్వతాసనం (ఓం మరీచయే నమః)- కాళ్ళు చేతులు నేలమీద ఉంచి నడుమును పైకెత్తి శ్వాస వదిలి పీల్చాలి ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) - కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆన్చి రెండు చేతులు, తల, నడుము వెనక్కు వంచాలి పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) - చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఉంచి తల మోకాలుకి తగిలేలా ముందుకి వంగాలి హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయ నమః) - రెండు చేతులు పైకెత్తి  తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి 

నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) -  నమస్కారం చేయాలి

ఈ 12 ఆసనాలు వేసేటప్పుడు శ్వాసపై ధ్యాసతో పాటూ ప్రార్థనను కూడా జోడిస్తే శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయని చెబుతారు