Durgastami  2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చే దుర్గాదేవి...బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ,  కాత్యాయనీ, మహాలక్ష్మి , లలితా దేవి, మహా చండీదేవి, మహాసరస్వతిగా అనుగ్రహించింది. నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు అమ్మ దుర్గమ్మగానే దర్శనమిస్తోంది.  

Continues below advertisement

మహాకాళీ నుదుటి నుంచి ఉద్భవించినదే దుర్గ అని చెబుతారు కొందరు. అందుకే కనకదుర్గమ్మను కాళీ, చండీ, రక్తబీజగా పూజిస్తారు. నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను పూజిస్తారు. 8 శక్తి రూపాలుగా చెప్పే  బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నరసింహి, ఇంద్రాణి, చాముండిని కొలుస్తారు. 

దుర్గ అంటే దుర్గమైనది 

Continues below advertisement

దుర్గ అంటే దుర్గతులను తొలిగించేది 

దుర్గ అంటే దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చేది

లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని స్తుతిస్తారు దుర్గ అనే నామం ...గత జన్మ వాసనలు  తుడిచేసి దుర్గుణాలను సద్గుణాలుగా మార్చుతుందని, సంతోషాన్నిస్తుందని చెబుతారు దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షస బాధలు ఉండవు మొదటి 3 రోజులు దుర్గా రూపం - అరిషడ్వర్గాలను జయించేందుకు పూజిస్తారు

తర్వాత మూడు రోజులు లక్ష్మీరూపం..ఐశ్వర్యం కోసం

చివరి మూడు రోజులు సరస్వతీ రూపం..జ్ఞానం, విజయం కోసం పూజిస్తారు శరన్నవరాత్రుల్లో దుర్గా సప్తశతి, దుర్గా సప్త శ్లోకీ  పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎంతో విశిష్టమైన దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి 9 రోజుల్లో ఈ 13 అధ్యాయాలను పారాయణం చేయడం మంచిది. మొదటి ఆరు రోజులు కుదరకపోయినా చివరి మూడు రోజుల్లో దుర్గాసప్తశతి పారాయణం చేస్తే అత్యుత్తమ ఫలితాలు పొందుతారు

శ్రీ దుర్గా సప్త శ్లోకీ

శివ ఉవాచ ।దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని ।కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ॥

దేవ్యువాచ ।శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ ।మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ॥

అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః ।

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా ।బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥ 

దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోఃస్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యాసర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥  

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ॥  

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥  

రోగానశేషానపహంసి తుష్టా-రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।త్వామాశ్రితానాం న విపన్నరాణాంత్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥ 

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ ॥  

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ ।

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!