Puja Room: ప్రతి హిందువు ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉన్నట్లే, ప్రతి ఇంటికి సరైన దిశలో దేవుని గది కూడా ఉంటుంది. దేవుడి గదిలో ప్రశాంతంగా ఉన్న దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచుతారు. దేవుని గదిలో మనం ఉంచే ప్రతి ఫొటో లేదా విగ్రహం ఆకారం, రంగు, ఎత్తును సరైవనిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.  శారీరక, దైవ, ప్రాపంచిక సమస్యల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇంట్లో దేవుడి గదిలో కొన్ని నియమాలు పాటించాలి. మ‌రి ఆ నియ‌మాలు ఏంటో తెలుసా?


Also Read : భగవంతుని ప్రసాదం ఎందుకు స్వీక‌రించాలి? అందరికీ ఎందుకు పంచాలి?


 దేవుడి గది ఎలా ఉండాలంటే!


1. పూజ‌ గదిని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోవాలి.


2. పూజ‌ గ‌దిలో దేవుడి విగ్ర‌హాలు లేదా ఫొటోలు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి.


3. పూజ‌ గది ఎప్పుడూ సరళంగా ఉండాలి. దానికి గోపురం లేదా త్రిశూలం ఉండకూడదు.


4. పూజ గ‌దిలో పాలరాతి మందిరాలు పెట్ట‌డం మానుకోండి. చెక్కతో చేసిన మందిరాలే ఉత్తమమైనవి అంటారు పండితులు 


5. పూజ‌ గదిలో ఎక్కువ సంఖ్య‌లో దేవుని విగ్రహాలను ఉంచకూడదు.


6. పూజ గ‌దిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు.


7. దేవుడి విగ్రహం ఎత్తుగా ఉండకూడదు. బొటనవేలు ఎత్తుకు సమానంగా ఉంటే అది చాలా శుభప్రదం.


8. ఇంట్లో శివలింగాన్ని ఉంచవద్దు. ఒక వేళ ఉంటే, నిత్యం అభిషేకం చేయడం మర్చిపోవద్దు.


9. బాల కృష్ణుడి విగ్రహం పూజ‌ గదిలో ఉండాలి. దానికి త‌ప్ప‌నిస‌రిగా రోజువారీ భోగాలు అందించాలి.


10. పూజ‌గ‌దిలో నటరాజ విగ్రహం ఉండకూడదు.


11. శ్రీరామ ప‌ట్టాభిషేకం, శివ కుటుంబం కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటో త‌ప్ప‌నిస‌రిగా పూజ‌గ‌దిలో ఉండాలి.


12. శాంత స్వరూపంలో ఉన్న‌ దుర్గాదేవి విగ్రహాన్ని మాత్ర‌మే ఇంట్లో ఉంచాలి.


13. పూజ గ‌దిలో మీ పూర్వీకులు లేదా త‌ల్లితండ్రుల ఫోటోలు పెట్టవద్దు.


14. పూజ‌ గదిలో దీపం వెలిగించాలి. మీ ఇల్లు తూర్పు ముఖంగా లేకుంటే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించడం మ‌ర్చిపోకండి. సంధ్యా సమయంలో తూర్పు ముఖంగా దీపం వెలిగించండి.


15. ఇంట్లో మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచవద్దు.


16. ఒక చేతిలో సంజీవిని పర్వతం, మరో చేతిలో గద పట్టుకున్న హనుమంతుడి విగ్రహం లేదా ఫొటో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ విగ్రహాన్ని పూజించడం ద్వారా గృహంలో సంక్షోభాలు తొలగిపోతాయి.


Also Read : పూజలో క‌లువ పూల‌ను ఎందుకు వినియోగిస్తారో తెలుసా?


17. ఇంట్లోని పూజ‌ గదిలో నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం మంచిది.


18.  భగవంతుడి పూజ ఎప్పుడైనా ప్రశాంతంగా చేయాలి


ఇంట్లో పూజ‌ గదిని ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా లేదా దేవుని గదిలో పైన పేర్కొన్న నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు ఐశ్వర్యం నెలకొంటాయని నమ్ముతారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.