Money Problem: హిందూ మత గ్రంధాలు మ‌న ఇంట్లో పేదరికం ఛాయ‌లు రాకుండా ఉంచ‌డానికి అనేక సూచ‌న‌ల‌ను ప్రస్తావిస్తాయి. వాటిని పాటించ‌క‌పోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లోని వస్తువుల నిర్వహణలో మనం చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది మనకు ఆర్థిక సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ప్రతిరోజూ మనం చేసే ఈ తప్పులు ఇంటి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. ఈ కారణంగా, ఇంట్లో అలాంటి తప్పులు చేయవద్దు.


సూర్యోదయం తర్వాత నిద్ర‌
సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఉదయాన్నే లేవడం వల్ల మనలో సానుకూలత పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. ఫ‌లితంగా మ‌న‌కు ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి అని అంటారు.


Also Read : సూర్యాస్తమయం తర్వాత ఇలా చేస్తే లెక్క‌లేన‌న్ని న‌ష్టాలు. ఈ ప‌నులు మీరు చేయ‌కండి


నీటి వృథా
మనం ఇంట్లో నీటిని వృధా చేయడం అశుభం. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల నీటి కుళాయి పగిలి అందులో నుంచి నీరు కారుతుంది. చాలా సార్లు మ‌నం దాని గురించి పట్టించుకోరు. కానీ, ఇంట్లోని నీటి కుళాయిల్లోని నీరు చుక్క చుక్క వృథా అయినట్లే, మన డబ్బు కూడా కొద్దికొద్దిగా వృథా అవుతుంది.


నిషేధిత రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరించడం
శాస్త్రాల ప్రకారం, గురువారం, ఏకాదశి వ్రతం రోజు మన జుట్టు, గోళ్లను కత్తిరించడం అశుభం. ఈ రెండు రోజులు విష్ణుమూర్తికి ఇష్ట‌మైన రోజులు. ఆయా రోజుల్లో ఈ ప‌నులు చేస్తే లక్ష్మీదేవికి మీపై కోపం తెప్పించవచ్చు. ఇది మీ ఇంటికి ఆర్థిక సమస్యలను కూడా తీసుకురావచ్చు.


పాడైన గ‌డియారం
గడియారం ఎల్లప్పుడూ మనకు సమయాన్ని సూచిస్తుంది. ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన గడియారాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ఇది మన సమయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇంట్లో ఉన్న గ‌డియారం లేదా మన మణికట్టు మీద ఉన్న వాచ్ అయినా ప‌నిచేస్తూ, సరైన సమయాన్ని చూపుతూ ఉండాలి.


సంధ్యా సమయంలో ఇవి ఎవరికీ ఇవ్వకండి
సంధ్యా సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వాటిలో పాలు, పెరుగు, ఉప్పు, పంచదార లేదా డబ్బు ముఖ్య‌మైన‌వి. సూర్యాస్తమయం తర్వాత వీటిని ఎవరికైనా ఇస్తే ఆర్థిక‌ సమస్యలు వస్తాయని చెబుతారు.


తెగిన‌ చెప్పులు ధ‌రించ‌డం
తెగిపోయిన‌ చెప్పు మళ్లీ ధరించడం అశుభం అంటారు. అలాంటి చెప్పులు ఇంట్లో పెట్టుకోకూడదు. చెప్పులు, చిరిగిన బట్టలు లేదా పాత లేదా ఉపయోగించని బట్టలు కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇలాంటి వాటిని ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంట్లో అలాంటి వస్తువులు ఉంటే, వాటిని ఎవరికైనా దానం చేయండి లేదా వాటిని సరిగ్గా పారవేయండి.


ఇంట్లో దుమ్ము, ధూళి
ఇంట్లో దుమ్ము, ధూళి లేదా సాలెపురుగులు ఎక్కువగా ఉంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాంటి ఇంట్లో నివసించేవారు ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి అశుభ వస్తువులు ఇంట్లో ఉంటే అశుభమే కాకుండా దారిద్య్రం కూడా వస్తుంది.


Also Read : ఇంట్లో దేవుడి విగ్రహం అకస్మాత్తుగా పగిలిపోతే దాని అర్థం ఏంటో తెలుసా?


పూజ చేయ‌ని ఇల్లు
హిందూమతంలో దేవుడిని పూజించడం, మంత్రాలు పఠించడం, ధ్యానం చేయడం వంటి వాటికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ కారణంగా ప్ర‌తి ఇంట్లో పూజ పునస్కారాలు తరచుగా చేస్తుంటారు. ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో దేవుడిని పూజించే ఆచారం ఉంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అయితే పూజ పునస్కారాలు చేయని ఇంట్లో ధన సమస్యలు ఎదురవుతాయని చెబుతారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.