వాస్తు సనాతన నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో వాస్తు పాత్ర చాలా ఉంటుంది. నియమానుసారం నిర్మించిన ఇంటి వైబ్రేషన్ ఎప్పుడూ బావుంటుంది. ఆ ఇంట్లో ఒక రకమైన శాంతిగా అనిపిస్తుంది. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు వాస్తు నియమాలు పాటించి నిర్మాణం చేసుకుంటేనే మంచిది. లేదంటే అనవసరపు అనుమానాలకు కారణం కావచ్చు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు కలకాలం సుఖశాంతులతో నిండి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తులో నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంపై చర్చ ఉంటుంది. వాస్తును అనుసరించి కట్టిన ఇల్లు సౌకర్యవంతంగానూ, అందంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పే పనిలేదు.  కొత్త ఇంటి నిర్మాణంలో అటాచ్డ్ బాత్ రూమ్ నిర్మాణంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.


వాస్తులో శక్తి ప్రవాహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రతి దిక్కులోనూ కచ్చితంగా సానుకూల శక్తి, ప్రతికూల శక్తి రెండూ ఉంటాయి. ఈ శక్తుల ప్రభావం ఆ ఇంటిలో నివసించే వారి మీది తప్పకుండా ఉంటుంది. కనుక ఆ శక్తుల నిర్వహణ ఇంటి నిర్మాణ సమయంలోనే జరిగితే మరీ మంచిది. ఇది వరకు రోజుల్లో బాత్రూమ్, టాయిలెట్లు ప్రధాన నివాస స్థలమైన ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. కానీ కాలం మారింది. నిర్మాణాలు చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అటాచ్డ్ బాత్రూమ్ లు నిర్మించుకుంటున్నారు. కనుక కొత్త ఇంటి నిర్మాణం చేపట్టే వారు తప్పనిసరిగా ఈ నియమాలు తెలుసుకోవడం అవసరం.


దంపతుల అనుబంధం పై ప్రభావం


బెడ్ రూమ్ లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ కూడా భార్యభర్తల అనుబంధం మీద ప్రభావం చూపిస్తుంది. పడకగదిలో నిద్రిస్తున్నపుడు పాదాలు బాత్రూమ్ వైపు ఉండకూడదు. ఇలాంటి స్థితి ఉంటే ఇంట్లో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఈ గొడవలు చాలా తీవ్రంగా ఉండి విడాకులకు కూడా కారణం కావచ్చు.


ఆర్థిక స్థితి మీద కూడా ప్రభావం


అటాచ్డ్ బాత్ రూమ్ ఇంట్లో సరైన దిశలో లేకుంటే అది ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. క్రమంగా కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. బాత్ రూమ్ తలుపు నిద్రించే సమయంలో మూసి ఉండేట్టు చూసుకోవాలి.


వాస్తు నియమాలు పాటిస్తే శాంతిగా ఉంటుంది.


అటాచ్డ్ బాత్రూమ్ ల వల్ల ఇంట్లో అప్పుడప్పుడు వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఇలాంటి దోషాల నివారణకు ఒక గాజు పాత్రలో ఉప్పు నింపి బాత్రూమ్ లో ఒక మూలన పెట్టాలి. ఈ ఉప్పును వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. తీసేసిన ఉప్పును సింక్ లో ఫ్లష్ చెయ్యాలి. అదే గిన్నెలో మళ్లి కొత్తగా ఉప్పు నింపి బాత్రూమ్ లో పెట్టాలి. ఈ పరిహారంతో బాత్రూమ్ కు సంబంధించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి. బాత్రూమ్ లో టాయిలెట్ సీట్ ఎప్పుడూ మూసి ఉంచాలి. ప్రతికూల శక్తి ఇక్కడి నుంచి బయటికి వస్తుంది. ఫలితంగా ఆర్థిక నష్టాలు చుట్టుముడుతాయి.



Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?