Ashada Masam Bonalu 2025:   తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢబోనాలు జూన్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించనున్నారు. జులై 13 ఆదివారం లష్కర్ బోనాలు, జూలై 20 ఆదివారం రోజు లాల్ దర్వాజా సింహవాహినికి బోనం సమర్పించనున్నారు. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజు ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు జూలై 24 ఆషాఢ అమావాస్యతో ముగుస్తాయి.

జూన్ 26 గోల్గొండ అమ్మవారికి తొలిబోనం

రెండో పూజ జూన్ 29 ఆదివారం

మూడో పూజ జూలై 3 గురువారం

నాలుగో బోనం జూలై 6 ఆదివారం

ఏదో పూజ జూలై 10 గురువారం

ఆరో పూజ జూలై 13 ఆదివారం

ఏడో పూజ జూలై 17 గురువారం

ఎనిమిదో పూడ జూలై 20 ఆదివారం

చివరిగా జూలై 24 గురువారంతో ఉత్సవాలు ముగింపు

తింటున్న భోజనం బాగోలేదంటూ విమర్శిస్తూ తింటారు కొందరు..ఆ ఆహారం ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి లష్కర్ బోనాలను 2 రోజులపాటు నిర్వహిస్తారు. లష్కర్ బోనాలు ముగిసిన మర్నాడు రంగం నిర్వహిస్తారు.  బోనాలు వేడుకలో భాగంగా పోతరాజుల విన్యాసాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్ లో ఘనంగా జరుగుతాయ్ ఆషాఢ బోనాలు. భాగ్యనగరంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా మహంకాళిని పూజించి, గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. మట్టికుండలో బోనం వండి అమ్మకు సమర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కరువు కాటకాలు లేకుండా చేయాలని, అంటువ్యాధుల నుంచి కాపాడాలని వేడుకుంటారు.  

ఒకప్పుడు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ సమయంలో మహంకాళికి బోనం సమర్పించి బయపడ్డారు ప్రజలు. ఆ వ్యాధినుంచి బయటపేడేసినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఎలా ఏటా ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.

నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలుంటాయి..మీరు ఎలాంటి దోషం ఉన్న ఆహారం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి నివేదించేందుకు వండిన కుండను పుసుపు, కుంకుమ, సున్నం, పూలు, వేపకొమ్మలతో అలంకరిస్తారు. ఆ కుండపై ప్రమిద పెట్టి దీపం వెలిగింది..కుండను తలపైపెట్టుకుని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. వానలు బాగా కురవాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మకు బోనం సమర్పిస్తారు. అమ్మవారికి బోనంతో పాటూ సాక సమర్పిస్తారు..సాక అంటే చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి పానకం తయారు చేస్తారు. ఆ తీర్థంలోవేపకొమ్మలు ఉంచి అమ్మవారికి నివేదిస్తారు.

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వందల ఏళ్ల నుంచి బోనాల సంప్రదాయం సాగుతోంది. అప్పట్లో కొండ కోనల్లో జీవించేవారంతా ఓ రాయిని అమ్మవారిగా భావించి పూలు, పళ్లు, పసుపు, కుంకుమ, పండిన పంట సమర్పించేవారు. అలా మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ సాగుతోంది. పల్లవుల కాలంలోనే తెలుగు నేల‌పై బోనాలు జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్లమ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి అమ్మవారికి బోనం సమర్పించారట. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్లమ్మగుడి కట్టించి బోనం సమర్పించాడట స‌ర్వాయి పాప‌న్న.

షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి