2022 ఏప్రిల్ 18 సోమవారం రాశిఫలాలు


మేషం
ఈరోజు మీకు అధ్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్స్ పొందుతారు. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. రోజు ప్రారంభం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. కొన్ని పనులకు అంతరాయం కలగవచ్చు.


వృషభం
 ఈ రాశి ఉద్యోగులతో సహోద్యోగులు సంతోషంగా ఉంటారు.  రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. కార్యాలయంలో కొన్ని మార్పులు చేసే ఆలోచన చేస్తారు. 


మిథునం
కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. రుణాలు తీసుకోవద్దు.  ఈరోజు వ్యాపారానికి సంబంధించి పెద్ద ఒప్పందాలు చేసుకోకండి. విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రశాంతంగా వినేవారితో మీ మనసులో మాట చెప్పుకోండి. ఒత్తిడి పెరుగుతుంది.  కోపాన్ని అదుపులో పెట్టుకోండి.


Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి


కర్కాటకం
తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు విద్యా రంగంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడాన్ని కోల్పోవద్దు. మీ జీవనశైలిని సరళంగా ఉంచండి. మీరు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఏకాంతంలో ఉండేందుకు ఇష్టపడతారు.


సింహం
మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. స్నేహితులతో సమయం గడపగలుగుతారు. బంధువుల ఇంటికి వెళతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త పనుల పట్ల అంకితభావం ఉంటుంది. మీ ప్రణాళికను బహిర్గతం చేయవద్దు. పాత విషయాలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వివాదం రావచ్చు.


కన్యా
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపవచ్చు. మీ ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రజలు మీ పట్ల చాలా ఆకర్షితులవుతారు. వ్యాపారంలో కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు డబ్బు గురించి ఎవరికీ వాగ్దానం చేయవద్దు. ప్రయాణం వాయిదా వేసేందుకు  ప్రయత్నించండి.


తులా 
ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు ప్రజల నుంచి ప్రశంసలు పొందుతారు. మంచి వ్యక్తులను కలుస్తారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించవచ్చు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.
 
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు


వృశ్చికం
ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. తప్పుడు అనుబంధాల కారణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపార పరిస్థితి బాగుంటుంది.


ధనుస్సు
ఉద్యోగుల సమస్యలు తొలగుతాయి. మీరు ప్రశంసలు అందుకుంటారు.  మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి.  దంపతుల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు. అధిక శ్రమ వల్ల అలసట ఉంటుంది.


మకరం
మరీ ఎమోషనల్‌గా ఉండటం మంచిది కాదు. జీవితంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇంటికి అతిథులు రావొచ్చు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీరు సీనియర్ అధికారులను కలవొచ్చు. కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు.


Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే


 కుంభం
విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. యువత తమ కెరీర్‌పై చాలా సీరియస్‌గా ఉంటారు. మీ దృష్టిని పనిపై పెట్టండి. రుణ లావాదేవీలు వివాదాలకు కారణమవుతాయి. ఇంటి పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు.


మీనం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. క్రమం తప్పకుండా యోగా , వ్యాయామం చేయండి. షుగర్, బీపీ రోగులు ఒత్తిడికి దూరంగా ఉండండి. ప్రేమికుల మధ్య గొడవ జరుగుతుంది. ఈ రోజు కొత్తపనిని ప్రారంభించవద్దు.