Horoscope Today 10 February 2022:ఈ రాశివారు ఈ రోజు రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement

ఫిబ్రవరి 10 గురువారం రాశిఫలాలు

Continues below advertisement

మేషం
రోజు సరిగ్గా ప్రారంభం కాదు. చికిత్స కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీరు స్నేహితులను కలుసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన పనుల్లో కొంత ఇబ్బంది ఎదురవొచ్చు.  ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

వృషభం
ఈ రోజు వృషభ రాశి వారికి మంచి రోజు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. దంపతులు పాత విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేయవచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.

మిథునం
చెడు సాంగత్యం కారణంగా మీరు బాధపడతారు. వ్యాపారులు నష్టపోతారు. మీరు అనవసరమైన పనులపై సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి.  మీపై ప్రతికూలత పెరుగుతుంది.  పాత విషయాలతో ఇబ్బందులు కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. 

కర్కాటకం 
ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. ఈరోజు ఆఫీసులో బాధ్యత తగ్గుతుంది. పనిని సకాలంలో పూర్తి చేస్తారు. సామాజిక బాధ్యతలు నిర్వర్తించగలరు. భూమి ఆస్తి, ధన ఆస్తుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. కొన్ని ఇబ్బందులు తొలగి సంతోషంగా ఉంటారు.

సింహం
మీ పనిలో క్రమబద్ధత ఉంటుంది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. కార్యాలయంలోని అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. మీ సహచరుల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. కొత్త పని ప్రారంభిస్తారు. 

కన్య
ఈ రోజు మీ రోజు సానుకూలంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల ఫలితాలతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో ఎవరితోనైనా విభేదాలు రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. 
 
తుల
కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉంటారు. ప్రతి పనినీ వాయిదా వేసే అలవాటు వల్ల మీరు నష్టపోవచ్చు.  వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పులను పునరావృతం చేయవద్దు. గతంలో జరిగిన నష్టాల నుంచి పాఠాలు నేర్చుకోండి. మంచి అవకాశం కోసం ఒక కన్ను వేసి ఉంచండి.

వృశ్చికం
వ్యాపార పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. మీ మనసులో సంతృప్తి ఉంటుంది. పని తీరులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వగలుగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆలోచన వల్ల ఇతర వ్యక్తులు ప్రభావితమవుతారు.
 
ధనుస్సు
ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతారు.  అనేక రకాల ఆలోచనల కారణంగా మీరు నిర్ణయం తీసుకోలేరు.ఈరోజు ఆఫీసులో చాలా బిజీగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న మీ పనులను పూర్తి చేయడానికి మీరు కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృథా చేయకండి.

మకరం
మీ పనిలో వేగం మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు మీ బంధువుల నుంచి మంచి సమాచారం పొందుతారు. ఆధునికత ప్రభావం మీ ఆలోచనలపై కనిపిస్తుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టకుండా ప్రయత్నించండి.కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.

కుంభం
ఈరోజంతా పరధ్యానంగా ఉంటారు.  పనుల్లో మనసు తేలికగా అనిపించదు. దిక్కులేనితనం ఎక్కువ అవుతుంది. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వ్యాపారం లాభిస్తుంది. మీరు కార్యాలయంలో సీనియర్ వ్యక్తుల మద్దతు పొందుతారు. మీరు సాంకేతిక రంగంలో విజయం సాధించగలరు.

మీనం
 పూర్వ సంబంధాల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. స్నేహితులతో కలిసి షికారు వెళ్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో కొత్తదనపు భావనతో ఉంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపారులకు అనుకూలమైన రోజు. 

Continues below advertisement