జులై 12 మంగళవారం రాశిఫలాలు (Horoscope 12-07-2022)  


మేషం
ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. మంచి జీతం పొందగలుగుతారు. దగ్గరి బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. వ్యాపారులు అప్పులు చేయవలసి రావచ్చు. అలసట ఎక్కువగా ఉంటుంది. వైవాహిక సంబంధాలలో ఆటంకాలు తొలగిపోతాయి. పనిని వాయిదా వేసే ధోరణికి దూరంగా ఉండండి. విద్యార్థులు లాభపడతారు.
 
వృషభం
ఎవరికైనా రుణం ఇవ్వాలన్న ఆలోచన మంచిది కాదు. ప్రత్యర్థుల వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు.  చికాకులకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. బైక్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.


మిథునం
ఈ  రోజు మీకు అద్భుతమైన రోజు అనిపిస్తుంది.  కొత్త వ్యక్తులను కలుస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని పొందుతారు.  మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. రిస్క్ తీసుకోకండి.


Also Read: జులై 12 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అభయాన్నిచ్చే ఆంజనేయ శ్లోకం


కర్కాటకం
 మీరు మానసిక గందరగోళంలో ఉండిపోతారు. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవద్దు.  ఆఫీసు పనుల్లో పురోగతి నిదానంగా సాగుతుంది. అధికారులతో వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంది.  బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి. రావాల్సిన మొత్తం చేతికందుతుంది.  పూజల పట్ల ఆసక్తి ఉంటుంది.  జ్ఞానవంతులను కలుస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. 


సింహం
సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి.  ప్రభుత్వ పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉండవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి.  విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో డబ్బు సంపాదిస్తారు.  నూతన వధూవరులు ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఐటీ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. 


కన్యా
అధికారులు మీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కుటుంబ కలహాల కారణంగా మీ పని దెబ్బతింటుంది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. తొందరగా అలసిపోతారు.  ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.  డబ్బును వృధాగా ఖర్చుచేయొద్దు.  స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. ప్రయాణం చేసేందుకు అనుకూల సమయం. 


Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి


తులా
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు ప్లాన్ చేసుకోండి.  దంపతుల మధ్య దాపరికాలు ఉంటే మనస్పర్థలు పెరుగుతాయి.  భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. మీరు వృద్ధుల అనుభవంతో ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చాలా నేర్చుకోవచ్చు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. 


వృశ్చికం
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. ఏ  పనీ చేయాలని అనిపించదు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉండొచ్చు.ప్రేమికులకు ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుంది. అప్పు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టం రావచ్చు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. వాహనాన్ని నెమ్మదిగా నడపండి. తెలియని అడ్డంకుల వల్ల పనులు ఆగిపోతాయి. 


ధనుస్సు
మీ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలుస్తారు. శుభ కార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. మీ పిల్లల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావచ్చు. పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి.


Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది 


మకరం
కుటుంబం లేదా వ్యాపారానికి సంబంధించిన టెన్షన్ ఉంటుంది. మిత్రులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ప్రవర్తనను నియంత్రించుకోవాలి. ఆస్తి భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పని కోసం ప్రయాణం చేయవచ్చు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


కుంభం
ఉద్యోగులు కార్యాలయంలో ఆధిపత్యం వహిస్తారు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  కొత్తగా, సృజనాత్మకంగా ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు.  జీవిత భాగస్వామి సహకారంతో మీ పని సులువవుతుంది. రాజకీయ వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండవచ్చు. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


మీనం
ఎవరైనా మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. ఆఫీసులో మరింత బాధ్యత ఉంటుంది. పెట్టుబడికి సమయం సరిపోతుంది. మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీరు సాధించిన విజయాలతో సంతృప్తి చెందుతారు. 


Also Read: శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి