భోళాశంకరుడి అంశ అయిన ఆంజనేయుడిని పిలిస్తే పలుకుతాడు. ఆపదల్లో ఆదుకుంటాడు. ఎల్లవేళలా తమకు రక్షణగా ఉండాలని, ధైర్యాన్ని సమకూర్చాలని భక్తులు ఆంజనేయుని ఆరాధిస్తారు.అలాంటివారు నిత్యం ఈ శ్లోకాలను ఫఠిస్తే ఆంజనేయుడి కరుణకటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు. 


శ్లోకం 1
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
(మనస్సుని జయించినవాడు,గాలి వేగంతో సమానంగా పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు,వానరుల్లో ముఖ్యుడు, శ్రీ రామచంద్రుడికి దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.


శ్లోకం 2
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
(దయ్యాల బారి నుంచి కాపాడేవాడు, ఎక్కడ శ్రీ రాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కారం)


శ్లోకం 3
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
(ఎవరైతే హనుమంతుడిని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు)


శ్లోకం 4
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం||
(అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు)


శ్లోకం 5
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి త్వం ప్రాంజలీరాంజనేయం
(ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను)


శ్లోకం 6
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసం|
రామాయణం మహామాలారత్నం
వందే అనిలాత్మజం||
(గోమాత  పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారం)


శ్లోకం 7
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||
(ఎవరికీ సమానం కాని శక్తిని సొంతం చేసుకుని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారం)


శ్లోకం 8
ఆంజనేయమతిపాటలాలనం
కాంచనాద్రి కమనీయ విగ్రహం|
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనం||
(అంజనాదేవి కుమారుడు, దుష్టులను సంహరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారం)


శ్లోకం 9
ఆమూషీకృత మార్తాండం;
గోష్పతీ కృత సాగరం|
తృణీకృత దశగ్రీవం
ఆంజనేయం నమామ్యహం||
(సూర్య భగవాణుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోనివాడైన ఆంజనేయుడికి నమస్కారం)


శ్లోకం 10
అసాధ్య సాధక స్వామిన్
అసాధ్య తవ కింవధ|
రామదూత కృప సింధో
మత్కార్యం సాధ్యప్రభో||
(ఓ దేవా! నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమైనా సునాయాసంగా చేయగలవు. రామదూత అయిన నువ్వు కరుణామయుడవు.నా విన్నపమును సాధ్యం చేయు ప్రభు)