Importance of Chanting 'Gayatri Mantra' : హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని పవిత్రమైనదిగా , అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇది గాయత్రి మాతకు మాత్రమే కాదు.. త్రిమూర్తులు, శక్తి స్వరూపిణులు, సూర్యభగవానుడు, గణేషుడు, ఆంజనేయుడు సహా అందరూ దేవుళ్లు, దేవతలకు ఒక్కొక్కకరు ఒక్కో గాయత్రి మంత్రం ఉంటుంది. నిత్యం వీటిని జపించడం వల్ల ఆధ్యాత్మిక స్పృహ మేల్కొనడంతో పాటు దైవిక ఆశీర్వాదం కూడా లభిస్తుంది.

శ్రీ గణేష్ గాయత్రి మంత్రంఅన్ని దేవతలలో, ప్రతి శుభ కార్యానికి ముందు పూజించే మొదటి వ్యక్తి శ్రీ గణేష్.  'ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్'. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. దీనితో పాటు, పనిలో వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మానసిక శాంతిని పొందడానికి గణేష్ గాయత్రి మంత్రాన్ని జపించాలి.

శ్రీ నృసింహ గాయత్రి మంత్రంశ్రీ నృసింహ భగవానుని గాయత్రి మంత్రం 'ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్'. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శత్రువులపై విజయం సాధించడంతో పాటు భయం , భయాందోళనలు దూరమవుతాయి. ఏదైనా దాడి నుంచి రక్షించడానికి నృసింహ గాయత్రి మంత్రం ప్రభావవంతంగా ఉంటుంది.

శ్రీ కృష్ణ గాయత్రి మంత్రంఅన్ని దేవుళ్ళలో శ్రీ కృష్ణుడు ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాడు. ఎవరైతే జీవితంలో భక్తి భావం, ప్రేమను కోరుకుంటున్నారో మరియు స్వార్థం లేదా మోహం నుంచి  విముక్తి పొందాలనుకుంటున్నారో, వారు శ్రీ కృష్ణుడి గాయత్రి మంత్రం, 'ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్' జపించాలి.

మహాలక్ష్మి గాయత్రి మంత్రంఎవరైతే జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారో, వారు లక్ష్మీదేవి గాయత్రి మంత్రం, 'ఓం మహాలక్ష్మీ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్' జపించాలి. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల కీర్తి మరియు సంపద లభిస్తాయి.

అగ్ని గాయత్రి మంత్రంబలహీన మనస్తత్వం కలిగిన లేదా ప్రభావవంతంగా మరియు ప్రతిభావంతులుగా మారాలనుకునే వారు అగ్ని గాయత్రి మంత్రం, 'ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్' జపించాలి.

ఇంద్ర గాయత్రి మంత్రంఒక వ్యక్తి అనేక రకాల వ్యాధులతో పాటు దెయ్యాలు వంటి ప్రతికూల శక్తులతో చుట్టుముట్టినప్పుడు ఇంద్ర గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇంద్ర గాయత్రి మంత్రం, 'ఓం సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్' జపించడం వల్ల అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

సరస్వతి గాయత్రి మంత్రంఎవరి బుద్ధి , వివేకం తప్పుడు విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తుందో, వారు సరస్వతి గాయత్రి మంత్రం, 'ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్.' జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసికంగా సానుకూల శక్తి లభిస్తుంది.

దుర్గా గాయత్రి మంత్రందుర్గా గాయత్రి మంత్రం, 'ఓం గిరిజాయై విద్మహే శివ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.' జపించడం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవడంతో పాటు శత్రువుల అహంకారంపై విజయం లభిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే . దీనిని అనుసరించే ముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మికవేత్త సలహాలు స్వీకరించండి.