Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి ఈ ఏడాదిలో జూలై 6వ తేదీన వచ్చింది. ఆషాడంలో వచ్చే ఈ ఏకాదశిని చాలా విశిష్టంగా భావిస్తారు. అందుకే తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు ఉపవాస పుణ్యం వస్తుందని భావిస్తారు. ఈ ఫలితం కోసమే ఎక్కువమంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. అయితే మీరు కూడా ఈ ఉపవాసం చేయాలనుకుంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఏకాదశి ఉపవాసం..

తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనుకుంటే.. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజున సాయంత్రం నుంచి ఫాస్టింగ్ ప్రారంభిస్తారు. ఏకాదశి ముఖ్యమైన రోజు. ఆ రోజంతా ఉపవాసం ఉండి.. విష్ణుమూర్తి పూజిస్తారు. ఉపవాసాన్ని ఆ రోజు కూడా విరమించకూడదు. ఏకాదశి ఉపవాసం ముగిసిన తర్వాత ద్వాదశి రోజున ఉపవాసం విరమించి భోజనం చేస్తారు. అంతసేపు ఉపవాసం చేయలేక కొందరు మాత్రం కేవలం

ఏకాదశి రోజునే ఫాస్టింగ్ చేస్తారు. 

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంతసేపు ఉపవాసం చేయకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. కేవలం ఏకాదశి రోజునే ఉపవాసం చేసినా.. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా ఏకాదశి ఉపవాసం ఎలా చేయవచ్చో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆధ్యాత్మికం.. 

ఫాస్టింగ్ అనేది ఆధ్యాత్మికత కోసం చేస్తున్నారని గుర్తించుకోవాలి. అలా చేసినప్పుడు ప్రశాంతత, గ్రాటీట్యూడ్, భక్తి అనేవి ఉపవాస సమయంలో మీతో ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఫాస్టింగ్ సమయంలో మానసికంగా, ఇతర ఆలోచనలు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. 

హైడ్రేషన్

కొందరు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అలాచేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల డీహైడ్రేట్ అయి ఇబ్బంది కలుగుతుంది. తలనొప్పి, కళ్లుతిరగండం వంటివి జరుగుతాయి. కాబట్టి మధ్యలో కాస్త నీరు లేదా హెర్బల్ టీలు లేదా కొబ్బరి నీళ్లు శరీరానికి అందించాలి. 

ఫుడ్ 

ఏమి తినకుండా దేవుడినికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అయితే ఫాస్టింగ్ సమయంలో చాలామంది ఏమి తినరు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కచ్చితంగా ఏదొకటి తినాలి. కాబట్టి అలాంటివారు వండిన ఆహారానికి బదులు ఫ్రూట్స్ తినొచ్చు. వండినవి లేదా స్పైసీ, ఆయిల్​తో నిండిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. 

పని వద్దు..

ఉపవాస సమయంలో దేవుడిమీదనే ధ్యాస ఉంచాలి. అంతేకానీ ఉపవాసం చేస్తూ.. ఇతర పనులు చేస్తూ ఉంటే ఓపిక నశించి మీ ఉపవాసం భంగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉపవాస సమయంలో ఎలాంటి పనులు లేకుండా.. ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. 

ఉపవాసం తర్వాత.. 

ఉపవాసాన్ని బ్రేక్ చేయాలనుకుంటే సిట్రస్, నిమ్మరసం, నానబెట్టిన నట్స్ వంటివాటితో బ్రేక్ చేయాలి. ఒకేసారి ఎక్కువ లేదా హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. నిదానంగా తినాలి. ఫాస్ట్​గా తింటే ఇబ్బందులు ఎదురవుతాయి. 

శరీరం ఏమంటే అదే.. 

ఉపవాసానికి మీ శరీరం సహకరిస్తే ఓకే. లేదు అంటే కూడా ఓకే. అవును చేయాలనే భక్తి మీకు ఉన్నా.. భక్తులు కష్టపడడం దేవుడికి ఇష్టముండదు. కాబట్టి ఉపవాసం బ్రేక్ చేసి ఆహారం తీసుకుంటే దోషంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి మీ శరీరానికి ఫుడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే.. ఎలాంటి ఆలోచన లేకుండా ఫుడ్ పెట్టేయండి. 

ఉపవాసం చేసేముందు మీ వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోండి. వారి సూచనల మేరకు మీరు ఈ ఫాస్టింగ్ చేస్తే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.