garuda purana: గరుడ పురాణం సనాతన హిందూ మతం, వైష్ణవానికి సంబంధించిన గ్రంథం. గరుడ పురాణంలో ఆచార్య కాండ వర్ణన ఆధ్యాత్మికత, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం నుంచి జీవితాన్ని మెరుగుపరుచుకోవడం వంటి అంశాలను వివరిస్తుంది. ఇది శ్రీ విష్ణువు 24 అవతారాల విశేషాలను తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి గరుడ పురాణం గురించి తెలుసుకోవలసిన కారణం ఇదే.
శ్రీమహావిష్ణువు తన వాహనమైన పక్షి రాజు గరుత్మంతునితో జరిపిన సంభాషణ గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో అబద్ధం చెప్పే వ్యక్తిని గుర్తించే మార్గం ఉంది. అబద్ధాలు చెప్పి ఇతరులను తప్పుదోవ పట్టించే వ్యక్తులు నేరస్తులతో సమానమే. గరుడ పురాణం ప్రకారం, అబద్దాలు చెప్పేవారి లక్షణాలు ఎలా ఉంటాయి?
భౌతిక ప్రదర్శన
ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని అతని భౌతిక రూపమే చెబుతుంది. స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక వ్యక్తి మనసులో ఏమి జరుగుతుందో వారి భౌతిక రూపాన్ని బట్టి తెలుస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి భుజాలు వంగినప్పుడు, అవతలి వ్యక్తి మీతో అబద్ధం చెబుతున్నాడని లేదా ఏదైనా దాచిపెడుతున్నాడని సూచిస్తుంది. ఇది కాకుండా, వ్యక్తి విశ్రాంత భంగిమలో మాట్లాడినా, అది అబద్ధానికి సంకేతం కావచ్చు.
అభిప్రాయానికి బలం కోసం
నిజం చెప్పడం ఒక వ్యక్తి ఉత్తమ గుణాలలో ఒకటి అయితే, అబద్ధం చెప్పడం కూడా అందరికి లేని కళ. తన అభిప్రాయాన్ని ఏ విధంగానైనా నిజమని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి బహుశా అబద్ధం చెబుతున్నాడని గ్రహించండి. తను చెప్పేది నిజమేనని నిరూపించుకోవడానికి అతను కష్టపడుతుంటాడు.
శారీరక సంజ్ఞలు
కొంతమంది మాట్లాడేటప్పుడు ఒకటి లేదా రెండు చేతులు కదిలిస్తారు. లేదా పాదాలను కదిలించడం సాధారణ ప్రవర్తన. కానీ ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు, అతని సాధారణ ప్రవర్తన లేదా అలవాటులో మార్పు ఉంటుంది. దీనితో పాటు, అబద్ధం చెప్పే వ్యక్తులు కంగారుగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వారి కళ్లు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తాయి.
తొందరపాటు
అబద్ధాలు చెప్పే వ్యక్తులు అనవసరమైన తొందరపాటుతో కనిపిస్తారు. మీరు వారిని ప్రశ్న అడిగినప్పుడల్లా వారు దానిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు వారి అబద్ధాన్ని మళ్లీ ప్రశ్నించినప్పుడు వారు వేరే పనిలో తలమునకలై ఉన్నట్లు ప్రవర్తిస్తారు.
కళ్లు పట్టిస్తాయి
ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అనేది అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా కళ్లు కదలకుండా అవును అని తల ఊపితే, ఆ వ్యక్తి మీతో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థం.
అలసిపోయినట్లు నటన
ఒక వ్యక్తి అలసిపోయినట్లు నటిస్తున్నప్పుడు, అతను మీ మాటలను జాగ్రత్తగా వింటున్నాడని, అతను మీకు అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోండి. మీరు చెప్పే విషయంపై అతనికి ఆసక్తి లేనందున, అతను అలసిపోయినట్టు నటిస్తూనే మీ మాటలు వింటాడు.
Also Read: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి కటాక్షించబోతోందని అర్థం!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.